Begin typing your search above and press return to search.

చివరి అసెంబ్లీ సమావేశాల్లో సంచలనాలు...!?

దాంతో ఈ మూడు నెలల కాల పరిమితిని ఓటాను అకౌంట్ ప్రవేశపెట్టడం ఒక బాధ్యత.

By:  Tupaki Desk   |   29 Jan 2024 4:30 AM GMT
చివరి అసెంబ్లీ సమావేశాల్లో సంచలనాలు...!?
X

ఏపీలో చివరి అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 6 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు కొద్ది రోజులు మాత్రమే జరుపుతారు. కొత్త ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలలు అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకూ మాత్రమే బడ్జెట్ ని ప్రవేశపెట్టే అర్హత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వానికి ఉంది. దాంతో ఈ మూడు నెలల కాల పరిమితిని ఓటాను అకౌంట్ ప్రవేశపెట్టడం ఒక బాధ్యత.

ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాలు చిట్ట చివరిగా ఉంటాయి. ఇందులో ఎవరి మళ్లీ గెలిచి అసెంబ్లీకి వస్తారో తెలియదు. అలాగే ఎంతమందికి టికెట్లు ఇస్తారో కూడా తెలియదు. వైసీపీ ఇప్పటికే చాలా మందికి టికెట్లు నో చెప్పేసింది. దాంతో అలాంటి వారికి ఈ సమావేశాలు ఒక విధంగా ఎమోషనల్ గా మారే అవకాశాలు ఉంటాయి.

అలాగే కీలక బిల్లులు ఏవైనా ఉంటే ఆమోదముద్ర వేసుకునే అవకాశం ఉంది. గత అయిదేళ్ళుగా ఉన్న కొన్ని డిమాండ్లు కానీ లేక ఎన్నికల వేళ ప్రజల అవసరాలను గుర్తించి తమకు ఉన్న అవకాశాల మేరకు వాటిని అమలు చేసే విషయంలో కానీ అసెంబ్లీ సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సమావేశాలలో జగన్ ఏమి మాట్లాడుతారు అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఈ సమావేశాలలో జగన్ మరోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా సామాజిక న్యాయం సంక్షేమం గురించి జగన్ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

జగన్ కి ఇది మంచి అవకాశం. ముఖ్యామంత్రిగా నిండు అసెంబ్లీ నుంచి ఆయన అయిదు కోట్ల మంది ప్రజలకు సందేశం ఇవ్వడం ఈ చివరి సెషన్ లో కీలకమైనది అని అంటున్నారు. అలాగే అనూహ్యమైన నిర్ణయాలు తీర్మానాలు కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలలో కనిపిస్తాయని అంటున్నారు.

వీటికి సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి అన్నది ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు అని అంటున్నారు. ఇక ఈ సమావేశాలకు ఎంతమంది హాజరవుతారు అన్నది కూడా ఆసక్తిని పెంచే విషయంగా ఉంచి. 151 మంది ఎమ్మెల్యేలు కలిగిన వైసీపీ తరఫున ఎంతమంది హాజరవుతారు అన్నది చూడాలి.

ఎందుకంటే టికెట్లు దక్కని వారు ఈసారి సమావేశాలకు వస్తారా అన్నది ఒక ప్రశ్న. అలాగే పార్టీని ధిక్కరించి బయటకు వెళ్ళిన వారు కూడా ఈ చివరి సమావేశాలలో కనిపించే అవకాశాలు ఉండవు అని అంటున్నారు. తెలుగుదేశం తరఫున చూస్తే చంద్రబాబు రెండున్నరేళ్ల క్రితమే సమావేశాలకు సెలవు ప్రకటించారు.

ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో ఎంత మంది వస్తారు అన్నది చూడాలి. ఎమ్మెల్యేగా ఉన్నపుడే సమావేశాలకు పెద్దగా రాని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ అమోదించినందువల్ల ఈసారి ఆయన కనిపించరు అని అంటున్నారు. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు, అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మరో నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఈసరికే నోటీసులు జారీ చేశారు.

అసెంబ్లీ సమావేశాలలోగా వారి మీద ఒక నిర్ణయం ఉంటుంది అని అంటున్నారు. సో అలా కనుక చూసుకుంటే వారంతా కూడా ఈసారి సమావేశాలలో కనిపించకపోవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఈసారి సమావేశాలు అనేక సంచలనాలకు వేదికగా మారనున్నాయని అంటున్నారు.