Begin typing your search above and press return to search.

హీరోయిన్ అరుదైన‌ స‌మ‌స్య‌.. ఫ్యాన్స్‌లో క‌ల‌వ‌రం!

న‌టించిన అర‌డ‌జ‌ను సినిమాల‌తోనే క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది స‌న్య మ‌ల్హోత్రా. వైవిధ్యం ఉన్న పాత్ర‌లు, కంటెంట్ తో ఇది సాధ్య‌మైంది

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:34 AM GMT
హీరోయిన్ అరుదైన‌ స‌మ‌స్య‌.. ఫ్యాన్స్‌లో క‌ల‌వ‌రం!
X

న‌టించిన అర‌డ‌జ‌ను సినిమాల‌తోనే క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది స‌న్య మ‌ల్హోత్రా. వైవిధ్యం ఉన్న పాత్ర‌లు, కంటెంట్ తో ఇది సాధ్య‌మైంది. ఈ బ్యూటీ చివరిగా షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'జవాన్'లో డాక్టర్ పాత్ర‌లో న‌టించింది. డాక్టర్ ఈరం పాత్రకు అభిమానులు, విమర్శకుల నుండి ప్ర‌శంస‌లు కురిసాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో స‌న్య తాను ఎదుర్కొంటున్న ఒక స‌మ‌స్య గురించి షాకింగ్ విష‌యం చెప్పి అభిమానుల్లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది. బాలీవుడ్‌లో చాలా విజయాలు సాధించినప్పటికీ 'ఇంపోస్టర్ సిండ్రోమ్‌' అనే అరుదైన రుగ్మ‌త‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ స‌మ‌స్య‌తో తన పోరాటంపైనా ఓపెనైంది.


బాంబే టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్యా మల్హోత్రా ఇంపోస్టర్ సిండ్రోమ్ గురించి మాట్లాడింది. స‌న్య‌ మాట్లాడుతూ,-''నేను చేసేది ఎప్పుడూ నాకు నచ్చేది కాదు. 'బధై హో'లో నా న‌ట‌న‌ను ప్రజలు ఇష్టపడ్డారు. కానీ నేను ఒక నిర్దిష్ట సన్నివేశాన్ని సరిగ్గా చేయలేదని బాధ‌ప‌డ్డాను'' అని తెలిపింది. అయితే, ఇప్పుడు తాను చాలా రిలాక్స్ డ్ గా ఉన్నానని పేర్కొంది. ''నాపై నేను అంత కఠినంగా ఉండకుండా, సరిగ్గా ఉండటం, పరిపూర్ణత కోసం ప్రయత్నించకుండా నాకు నేను మారడానికి సమయం పట్టింది'' అని కూడా తెలిపింది. అరుదైన‌ సిండ్రోమ్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టాకి చికిత్స పొందాన‌ని తెలిపింది. ఇతర నటీనటులు దానిని ఎలా ఎదుర్కొంటారో తెలీదు కానీ, ముఖ్యంగా షారూఖ్ ఖాన్ ఇంటర్వ్యూలు చూడ‌టం ద్వారా తాను స్ఫూర్తి పొందాన‌ని, మారాన‌ని పేర్కొంది.

ఢిల్లీ నుండి ముంబైకి వ‌చ్చాక‌..

అదే ఇంటర్వ్యూలో స‌న్య‌ మల్హోత్రా మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చిన తర్వాత తనకు ఏం జరిగిందో ఓ ఉదాహరణ చెప్పింది. నేను ఢిల్లీ నుండి ముంబైకి మారినప్పుడు బాలీవుడ్‌లో న‌టించాలంటే మీకు 10-15 సంవత్సరాలు పడుతుంది! అని ఒక‌రు చెప్పారు. కానీ నితేష్ తివారీ 'దంగల్' కోసం నాకు కాల్ వచ్చింది. నేను ఎప్పుడూ నా కల - ప్రయాణాన్ని నమ్ముతాను. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి! అని స‌న్య తెలిపింది.

మిమ్మ‌ల్ని మీరు న‌మ్మండి:

నేను చాలా దూరం వచ్చానని కొన్నిసార్లు నాకు నేను గుర్తు చేసుకుంటాను. 'పాగ్‌లైట్' వంటి కొన్ని ప్రశంసలు-అర్హమైన ప్రదర్శనల గురించి సాన్య గుర్తు చేసుకుంది. నాకు ఇలాంటి అవ‌కాశాలు రావడం కోసం నేను ఏడేళ్లు వేచి ఉన్నాననేది కొన్నిసార్లు నేను మర్చిపోతానని అంది. ''నేను చాలా దూరం వచ్చానని గుర్తు చేసుకోవాలి. ఒక అడుగు వెనక్కి వెళ్లి నేను ఏం సాధించాను? నా కెరీర్ ఎలా ఉందో చూడాలి. నాకు బలమైన ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. అది నన్ను స్థిరంగా ఉంచుతుంది. నన్ను వారంతా త‌ల‌బిరుసు లేకుండా తిరిగి గ్రౌండ్ లెవ‌ల్‌కి తీసుకువస్తూనే ఉన్నారు.. అని తెలిపింది.

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మీరు కఠినమైన దశ నుండి బయటపడతారు. క‌ష్ట‌న‌ష్టాలు సుఖ‌దుఃఖాలు అశాశ్వతం అనివార్యం. ఒకప్పుడు నాపై నేనే కటువుగా ఉండేదానిని.. ఇప్పుడు అలా లేను. ఈ రోజుల్లో నేను సంతృప్తిగా ఉల్లాసంగా ఉంటాను. మీ సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉండండి. ఇతరులు చెప్పేది వినవద్దు.. అని స‌న్య సూచించింది.

కెరీర్ జ‌ర్నీ ఇలా..

వర్క్‌వైజ్‌గా చూస్తే.. స‌న్య‌ మల్హోత్రా చివరిసారిగా అట్లీ తెర‌కెక్కించిన 'జవాన్‌'లో కనిపించింది. ఈ చిత్రం భారీగా క‌మ‌ర్షియ‌ల్ విజయాన్ని సాధించింది. తదుపరి భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితం ఆధారంగా మేఘనా గుల్జార్ తెర‌కెక్కిస్తున్న 'సామ్ బహదూర్‌'లో కనిపించనుంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ (టైటిల్ రోల్‌లో), ఫాతిమా సనా షేక్ కూడా నటించారు. 1 డిసెంబర్ 2023 న విడుదల కానుంది. ఇది కాకుండా ఆరతి దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' హిందీ రీమేక్ లోను న‌టిస్తోంది.