Begin typing your search above and press return to search.

రాగానే ఆస్పత్రిలో చేరిన ఆస్ట్రోనాట్... ముగ్గురు ఓకే, నాలుగో వ్యక్తికి ఏమైంది?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.) లో సుమారు ఎనిమిది నెలల పాటు (233 రోజులు) విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు భూమికి తిరిగివచ్చారు

By:  Tupaki Desk   |   26 Oct 2024 7:44 AM GMT
రాగానే ఆస్పత్రిలో చేరిన ఆస్ట్రోనాట్... ముగ్గురు ఓకే, నాలుగో వ్యక్తికి ఏమైంది?
X

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.) లో సుమారు ఎనిమిది నెలల పాటు (233 రోజులు) విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు భూమికి తిరిగివచ్చారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వ్యోమనౌకలో వారంతా అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి చేరువలో శుక్రవారం దిగారని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) తెలిపింది.

మార్చి 4 - 2024న ప్రయోగించబడిన క్యూ-8లో అమెరికాకు చెందిన మాథ్యూ డోమ్నిక్, మైఖేల్ బారట్, జీనట్ ఎప్స్, రష్యాకు చెందిన అలెగ్జాండర్ గ్రెంబికిన్ ఉన్నారు. వీరికి వైద్య పరీక్షలు అందాయాని నాసా తెలిపింది. అయినప్పటికీ అదనపు పరీక్ష కోసం ఆసుపత్రిలో ఉన్నారని చెబుతున్నారు.

అవును... ఎండీవర్ అని పేరు పెట్టబడిన క్ర్యూ డ్రాగన్ వ్యోమనౌకలో ప్రయోగాలు చేసిన నలుగురు వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చారు. వారు ముఖ్యంగా మెదడు, ఆర్గనాయిడ్స్, మొక్కల పెరుగుదలపై మైక్రోగ్రావిటీ ప్రభావలను అధ్యయనం చేశారు. అయితే ఈ నలుగురిలో ఒకరు అరుదైన వైద్య సమస్యను ఎదుర్కోంటున్నారనే ప్రచారం మొదలైంది.

అయితే వ్యక్తిగత గోప్యతలో భాగంగా అతని వివరాలు వెల్లడించలేదు. అతనిని పెన్సకోలా ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు వ్యోమగాములూ హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేయబడి.. హ్యూస్టన్ లోని నాసా స్పేస్ సెంటర్ కు తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో... ఐ.ఎస్.ఎస్. ఉన్నంత కాలం క్రూ-8 వ్యోమగాములు మానవ ఆరోగ్యం, మెటీరియల్ సైన్స్, వ్య్వసాయంతో సహా వివిధ రంగాలలో 200 కంటే ఎక్కువ ప్రయోగాలు చేశారని చెబుతున్నారు. భవిష్యత్తులో సుదీర్ఘ కాల అంతరిక్ష యాత్రలకు అవసరమైన జ్ఞానన్ని చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు!

వాస్తవానికి రెండు నెలల కిందటే ఈ నలుగురు వ్యోమగాములూ భూమికి రావాల్సింది. అయితే... బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో తలెత్తిన ఇబ్బందితో పాటు అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చిన మిల్టన్ తుఫాను కారణంగా వీరి తిరుగుప్రయాణం వాయిదా పడింది.

Image Credit: NASA/Joel Kowsky