Begin typing your search above and press return to search.

గబ్బాలో సారా టెండూల్కర్.. అతడి కోసమే వచ్చిందా?

టీమ్ ఇండియా భవిష్యత్ కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న శుబ్ మన్ గిల్ తో సారా టెండూల్కర్ కు ముడిపెడుతూ కొన్నేళ్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 Dec 2024 6:30 PM GMT
గబ్బాలో సారా టెండూల్కర్.. అతడి కోసమే వచ్చిందా?
X

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జీవితం తెరిచిన పుస్తకం. ఎందుకంటే అతడు 16వ ఏట నుంచే భారత క్రికెట్ లో భాగమయ్యాడు. నాటి నుంచి సచిన్ గురించిన ప్రతి విషయాన్ని 24 ఏళ్ల పాటు అభిమానులు తెలుసుకుంటూనే ఉన్నారు. రిటైరైన అనంతరం గత 11 ఏళ్లలో కూడా సచిన్ తరచూ బయట కనిపిస్తూనే ఉన్నాడు. ఇక సచిన్ కుటుంబం గురించి చెప్పాలంటే అతడు చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడు. తనకంటే ఐదేళ్లు పెద్దదైన డాక్టర్ అంజలిని సచిన్ పెళ్లాడాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్. అర్జున్ ను ప్రొఫెషనల్ క్రికెటర్ చేయాలని సచిన్ చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇప్పటికీ రంజీట్రోఫీలోనే తనను తాను నిరూపించుకోలేకపోయాడు. ఇక సారా మాత్రం చదువులో బ్రిలియంట్.

మన‘సారా’..

సచిన్ ఇద్దరు పిల్లల్లో అమ్మాయి సారా టెండూల్కర్ పెద్దది. 1997లో పుట్టిన సారా.. దీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, యూనివర్సిటీ కాలేజీ లండన్ లో చదివింది. సచిన్.. ఏ బిలియన్ డ్రీమ్స్ అనే సినిమాలోనూ తళుక్కుమంది. అయితే, వీటికంటే సారా తరచూ వార్తల్లో నిలుస్తున్నది టీమ్ ఇండియా యువ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లుగానే.

నిజమా? కాదా?

టీమ్ ఇండియా భవిష్యత్ కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న శుబ్ మన్ గిల్ తో సారా టెండూల్కర్ కు ముడిపెడుతూ కొన్నేళ్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై ఎటువైపు నుంచి కూడా నిర్ధారణ లేదు. కానీ, మీడియా మాత్రం ఇష్టం వచ్చినట్లు రాస్తోంది. అయితే, సారా-గిల్ మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాలు మాత్రం తొలగలేదు. గిల్‌, సారా కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉన్నార‌నే వదంతులు వస్తున్నాయి. అవి నిజం అన్న‌ట్లుగా వీరిద్ద‌రు క‌లిసి కొన్ని కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వీటిపై గిల్ కానీ, అటు సారా కానీ స్పందించ‌లేదు. ఆఖరికి స‌చిన్ కూడా..

గబ్బాలో అతడి కోసమేనా?

సారా టెండూల్కర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. అక్కడ బ్రిస్బేన్ లో శనివారం మొదలైన భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టుకు హాజరైంది. ప్రేక్ష‌కుల గ్యాల‌రీలో కూర్చొని టీమ్ ఇండియాకు మ‌ద్ద‌తు తెలిపిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారాయి. ఇక సారా వెనుక సీటులో టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్లు జ‌హీర్ ఖాన్‌, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ ఉన్నారు. సారా బ్రిస్బేన్ వచ్చింది గిల్ కోసమేనని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.