Begin typing your search above and press return to search.

అల్లుడు 200..మామ 200 కోట్లు అంటే న‌మ్మేస్తారా?

వ‌ర‌ల‌క్ష్మి-నోకోలాయ్ స‌చ్ దేవి వాహ‌హ ఖర్చుపై నెట్టింట పెద్ద చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 July 2024 5:45 AM GMT
అల్లుడు 200..మామ 200 కోట్లు అంటే న‌మ్మేస్తారా?
X

వ‌ర‌ల‌క్ష్మి-నోకోలాయ్ స‌చ్ దేవి వాహ‌హ ఖర్చుపై నెట్టింట పెద్ద చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లికి ముందు వ‌ర‌ల‌క్ష్మి కి నికోలాయ్ బంగారం చెప్పులు, డైమండ్ చీర‌, బంగారు అభ‌ర‌ణాలు క‌లిపి మొత్తంగా 200 కోట్ల వ‌ర‌కూ వ‌రల‌క్ష్మి కోసం ఖ‌ర్చు చేసాడ‌ని, ప్ర‌తిగా కుమార్తె పెళ్లి కోసం శ‌ర‌త్ కుమార్ మ‌రో 200 కోట్లు ఖ‌ర్చు చేసార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతుంది. థాయ్ లాండ్ లో గ్రాండ్ గా వివాహం, అంత‌కు ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు, చెన్నై తాజ్ హోట‌ల్ లో రిసెప్ష‌న్ మొత్తంగా శ‌ర‌త్ కుమార్ త‌న స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌కుండా వివాహం చేసార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజాగా ఈ ప్ర‌చారంపై శ‌ర‌త్ కుమార్ స్పందించారు. `అంత డ‌బ్బు ఎక్క‌డుందో నాకు కూడా తెలియదు. అంత డ‌బ్బు నేను ఏనాడు చూసింది కూడా లేదు. ద‌య‌చేసి ఇలాంటి ప్ర‌చారం చేయెద్దు. పెళ్లి కోసం అంత డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డం ఏంటి? చాలా సాధార‌ణంగానే వివాహం జ‌రిగింది. వివాహం ఎలా జ‌రిగిందో వ‌చ్చిన వారంద‌రికీ తెలుసు. నిరాధార‌మైన వార్త‌ల‌తో మ‌మ్మ‌ల్ని ఇబ్బంది పెట్టొద్దు` అని స్పందించారు.

దీంతో 400 కోట్ల పెళ్లి ప్ర‌చార‌మంతా అవాస్త‌వ‌మ‌ని తేలిపోయింది. ముంబైలో అత్యంత సంప‌న్నుల్లో నికోలాయ్ స‌చ్ దేవ్ ఒక‌రు. అక్క‌డ సొంతంగా ఆర్ట్ గ్యాల‌రీ ఉంది. ఆయ‌న‌కు 900 కోట్ల రూపాయ‌లు ఆస్తులున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే నికోలాయ్ కిది రెండ‌వ వావాహం. అతనికి మొద‌టి భార్య‌కి పుట్టిన 15 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కానీ వాటితో సంబంధం లేకుండా వ‌ర‌ల‌క్ష్మి అత‌డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక న‌టిగా వ‌ర‌ల‌క్ష్మి జ‌ర్నీ ఎలా ఉందో తెలిసిందే. తెలుగులో బిజీ న‌టిగా మారింది. హ‌నుమాన్ విజ‌యంతో అమెకి పాన్ ఇండియాలో గుర్తింపు ద‌క్కింది. ఆ సినిమా 400 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.