సర్పంచులకు గుడ్ న్యూస్ చెప్పిన వైసీపీ సర్కార్!
ఈ సమయం లో తాజాగా ఆ నిధుల ను పంచాయతీలకు విడుదల చేసింది. దీంతో సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 28 July 2023 3:04 PM GMTకేంద్రం విడుదల చేసిన రూ.4,041 కోట్లు.. 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.8,629 కోట్లు.. గ్రామ పంచాయతీల కు తక్షణం కేటాయించాలని సర్పంచులు డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్పంచుల కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
నిధుల కేటాయింపే ప్రధాన డిమాండ్ తోపాటు 15 సమస్యల పై ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో సర్పంచులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. వారి నిసరన కు ఫలితం దక్కింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలకు నిధుల్ని వైసీపీ ప్రభుత్వం జమ చేసింది.
అవును... పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం నిధుల ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని వివిధ అవసరాల నిమిత్తం వాడుకుంది. అయితే ఈ సమయం లో తాజాగా ఆ నిధుల ను పంచాయతీలకు విడుదల చేసింది. దీంతో సర్పంచులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా కేంద్రం పంచాయతీల కు కేటాయించిన నిధుల ను రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాల కు వాడుకోవడంపట్ల సర్పంచులు తీవ్ర నిరసన తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కార్యక్రమాల్లో కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ ల వద్ద ధర్నాలు నిర్వహించారు.
ఇదే సమయం లో తమ అనుమతి లేకుండా నిధుల్ని దారి మళ్లించిన వారి పై చర్యలు తీసుకోవాలని, పంచాయతీల ఖాతాల్లో డబ్బు జమ చేయాల ని సర్పంచులు కోరారు. తమ అనుమతి లేకుండా నిధుల్ని దారి మళ్లించిన వారి పై చర్యలు తీసుకోవాలని, పంచాయతీల ఖాతాల్లో డబ్బు జమ చేయాల ని సర్పంచులు కోరారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల కు కేంద్రం నుంచి విడుదలైన నిధుల్ని ప్రభుత్వం జమ చేయడం మొదలు పెట్టింది. దీంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధుల తో తమ పంచాయతీల పరిధి లోని సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటామని సర్పంచులు చెబుతున్నారు.