Begin typing your search above and press return to search.

ఎస్ ఏ ఎస్ గ్రూప్ సర్వే : బీయారెస్ తగ్గుతుంది...కాంగ్రెస్ పెరుగుతుంది...!

తెలంగాణా రాజకీయం వేడెక్కి ఉన్న వేళ శ్రీ ఆత్మ సాక్షి సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఎస్ ఏ ఎస్ గ్రూప్ పేరుతో రిలీజ్ అయిన ఈ సర్వేలో అనేక విషయాలను పొందుపరచారు

By:  Tupaki Desk   |   30 Oct 2023 9:18 AM GMT
ఎస్ ఏ ఎస్ గ్రూప్ సర్వే :  బీయారెస్ తగ్గుతుంది...కాంగ్రెస్ పెరుగుతుంది...!
X

తెలంగాణా రాజకీయం వేడెక్కి ఉన్న వేళ శ్రీ ఆత్మ సాక్షి సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఎస్ ఏ ఎస్ గ్రూప్ పేరుతో రిలీజ్ అయిన ఈ సర్వేలో అనేక విషయాలను పొందుపరచారు. ముఖ్యంగా 2018లో ఎలా ఓటు షేరింగ్ జరిగింది. ఇపుడు ఎలా ఓట్ల షేరింగ్ ఉండబోతోంది కూడా విడమర్చి చెప్పుకొచ్చారు.

ఇక 2018లో చూస్తే బీయారెస్ అధ్బుతమైన విజయాన్నే సాధించింది. అప్పట్లో బీయారెస్ కి 46.8 శాతం ఓట్ షేర్ వస్తే ఇపుడు అది కాస్తా 42.5 శాతంగా పడిపోతుందని సర్వే తేల్చింది. అంటే నాలుగు శాతం ఓట్ షేర్ తగ్గుతుంది అన్న మాట. ఇక 2018లో బీయారెస్ కి 88 సీట్లు వస్తే ఇపుడు 64 నుంచి 70 దాకా సీట్లు రావచ్చు అని పేర్కొంది. అంటే కేవలం 4.3 శాతం ఓట్ల షేర్ కి పద్దెనిమిది దాకా సీట్లు తగ్గుతాయని ఎస్ ఏ ఎస్ గ్రూప్ సర్వే పేర్కొంది.

అలాగే కాంగ్రెస్ విషయానికి వస్తే 2018లో ఆ పార్టీకి 28.43 శాతం ఓట్ షేర్ వస్తే ఈసారికి అది 36.5 గా రావచ్చు అని ఈ సర్వే అంచనా కట్టింది. అంటే ఏకంగా 8.07 శాతం ఓట్ల షేర్ కాంగ్రెస్ కి పెరగనుంది. అప్పట్లో కాంగ్రెస్ కి 19 సీట్లు మాత్రమే వస్తే ఈసారి అది డబుల్ అవుతుందని పేర్కొంది. ఈసారి 37 నుంచి 43 దాకా సీట్లు వస్తాయని వెల్లడించింది.

అదే విధంగా బీజేపీకి 2018లో 6.98 శాతం ఓట్ షేర్ వచ్చింది. ఈసారి 10.75 ఓట్ షేర్ రావచ్చు అని ఈ సర్వే చెబుతోంది. అంటే 3.77 శాతం ఓటు షేర్ బీజేపీకి పెరుగుతోందని వెల్లడించింది. అప్పట్లో బీజేపీకి కేవలం ఒక సీటు మాత్రమే వస్తే ఈసారి అయిదారు దాకా రావచ్చు అంటోంది. అంటే అయిదు రెట్లు ఎక్కువ అన్న మాట.

మజ్లీస్ విషయానికి వస్తే 2018లో ఓట్ షేర్ 2.71 శాతంగా ఉంటే ఇపుడు 2.75గా ఓటు షేర్ పెరగవచ్చు అని సర్వే అంటోంది. ఇది 0.04 శాతం పెరుగుదల గా పేర్కొంది. సీట్లు చూస్తే అపుడూ ఇపుడూ కూడా ఆ ఏడు సీట్లే వస్తాయని అంటోంది. మజ్లీస్ పరిస్థితిలో మార్పులు ఏమీ లేవు అన్న మాట.

ఇక అదర్స్ కేటగిరిలో చూస్తే 2918లో అదర్స్ కి 15.08 శాతంగా ఓట్ల షేర్ వస్తే ఈసారి 7.5 శాతంగా ఓట్ షేర్ పడిపోతోంది. ఇది 7.58 శాతం తరుగుదలగా ఉంది. అదర్స్ కి 2018లో రెండు సీట్లు వస్తే ఈసారి కూడా ఒకటి నుంచి రెండు సీట్ల దాకా రావచ్చు అని లెక్క వేసింది.

ఇక సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ని చూస్తే 1.75 శాతంగా ఉండొచ్చు అని పేర్కొంది. ఈ సైలెంట్ ఓటింగే ఫలితాలను తారు మారు చేసే అవకాశం ఉంది. ఇది ఏ పార్టీకి టర్న్ అయితే రెండవ పార్టీకి డబుల్ లాస్ అవుతుంది అని అంటున్నారు. ఇక ఇందులో కూడా ఎనభై శాతం మంది ఏదో ఒక పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉందని అంటోంది సర్వే.

ఓవరాల్ గా చూస్తే ఈ సర్వే ప్రకారం బీయారెస్ గతానికంటే 18 నుంచి పాతిక సీట్ల దాకా నష్టపోయే చాన్స్ ఉంది. అదే విధంగా గ్రాఫ్ బాగా పెంచుకున్న కాంగ్రెస్ గత 19 సీట్ల కంటే రెట్టింపు అంటే 37 నుంచి 43 దాకా ఎదిగి అక్కడ నిలిచిపోయే అవకాశం ఉంది. బీజేపీకి మాత్రం ఒక సీటు నుంచి ఆరు సీట్ల దాకా దక్కుతాయని చెబుతోంది.

దీని బట్టి బీజేపీకి సీట్లూ ఓట్లూ పెరుగుతాయన్న మాట. ఇక ఎస్ ఏ ఎస్ గ్రూప్ క్లారిటీగా చెప్పేది ఏంటి అంటే కాంగ్రెస్ బీజేపీ ఓట్లు ఎంత పెంచుకున్నా సీట్లు ఎన్ని తెచ్చుకున్నా అధికార పీఠానికి ఆమడ దూరంలోనే ఉంటాయని. మొత్తంగా గులాబీ పార్టీ సింపులు మెజారిటీతో అయినా మళ్లీ పవర్ లోకి వస్తుందని సర్వే అంటోంది.