Begin typing your search above and press return to search.

'బిట్ కాయిన్ సృష్టికర్త'పై సంచలన డాక్యుమెంటరీ... యూఎస్ ఎలక్షన్ పై ఎఫెక్ట్!?

ఇక, ఈ డాక్యుమెంటరీలో ఏముందంటే.. తొలిసారి బిట్ కాయిన్ చేసిన వ్యక్తి సతోషి నకమోటో కాదని!

By:  Tupaki Desk   |   9 Oct 2024 11:30 AM GMT
బిట్  కాయిన్  సృష్టికర్తపై సంచలన డాక్యుమెంటరీ... యూఎస్  ఎలక్షన్  పై ఎఫెక్ట్!?
X

ఎమ్మీ నామినేట్ చేసిన దర్శకుడు కల్లెన్ హోబ్యాక్ రూపొందించిన ఓ డాక్యుమెంటరీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందులో పేర్కొన్న అంశాలు నిజమని తేలితే.. ఇది ప్రపంచ ఆర్థిక మార్కెట్లతో పాటు త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికపై కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ఇక, ఈ డాక్యుమెంటరీలో ఏముందంటే.. తొలిసారి బిట్ కాయిన్ చేసిన వ్యక్తి సతోషి నకమోటో కాదని!

అవును... క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ను తొలిసారి చేసిన వ్యక్తిగా ఇప్పటివరకూ సతోషి నకమోటో పేరు ప్రాచుర్యంలో ఉంది! అయితే... వాటిని తొలిసారి చేసింది అతడు కాదు.. కెనడాకు చెందిన పీటర్ టోడ్డ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వీటిని తొలిసారి తయారుచేశాడని అంటున్నారు. ఈ మేరకు "మనీ ఎలక్ట్రిక్: బిట్ కాయిన్ మిస్టరీ" పేరిట విడుదలైన 100 నిమిషాల డాక్యుమెంటరీ ఈ విషయాలు చెబుతుంది.

ఈ చిత్రంలో బిట్ కాయిన్ తో డీల్ చేసే చాలా మంది వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసినట్లు చూపించారు. ఈ డాక్యుమెంటరీలో కల్లిన్ హోబ్యాక్.. పాత బిట్ కాయినర్ ఫోరం పోస్టింగ్ లను కూడా దీనికి ఆధారాలుగా చూపించారు. ఇప్పుడు హెచ్.బీ.వో. టోడ్డ్ పేరును డాక్యుమెంటరీ పరిచయం చేయడం సంచలనంగా మారింది. ఇతడు డిట్ హబ్ లో క్రిప్టో గ్రాఫీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడని చెబుతున్నారు.

వాస్తవానికి 2009లో బిట్ కాయిన్లు విడుదల నాటి నుంచే సతోషి నకమోటో వ్యక్తా.. లేక, ఓ గ్రూపా అనే చర్చ మొదలైంది. అనంతరం ఈ వ్యవహారంపై పలు పుస్తకాలు కూడా వచ్చాయి. అయితే.. వీటిలో వేరు వేరు వ్యక్తులను సతోషి నకమోటోగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయిన పరిస్థితి. ఇందులో భాగంగా... 2014లో ఓ ఫిజిస్ట్ ను "న్యూస్ వీక్" పత్రిక తెరపైకి తేగా.. 2015లో న్యూయార్క్ టైమ్స్ ఓ కంప్యూటర్ సైటిస్ట్ ని తెరపైకి తెచ్చింది.

ఇదే క్రమంలో 2016లో తానే సతోషి నకమోటో అంటూ ఆస్ట్రేలియన్ క్రిప్టోగ్రాఫర్ క్రెయిగ్ స్టీవెన్ రైట్ వాదించాడు. అయితే... అందుకు సారిపడా ఎటువంటి దృఢమైన సాక్ష్యాలను అందించలేకపోయాడు. ఇలా ఇప్పటివరకూ సతోషి నకమోటోగా పలువురు పరిచయమయ్యారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన డాక్యుమెంటరీ ప్రకారం... కెనడాకు చెందిన పీటర్ టోడ్డో పేరు తెరపైకి వచ్చింది.

కాగా... సతోషి వద్ద సుమారు 1.1 మిలియన్ బిట్ కాయిన్ ఉందని అంచనా వేయబడింది. దాని విలువ ఈ రోజు 66 బిలియన్ డాలర్లతో సమానం అని చెబుతున్నారు. అయితే.. ఆ సంపదను మార్చటానికి అవసరమైన క్రిప్టోగ్రాఫిక్ కీలకు యాక్సెస్ కలిగి ఉన్నరా అనేది మాత్రం అస్పష్టం ఉందని అంటున్నారు!