Begin typing your search above and press return to search.

భారీగా పెరిగిన సత్య నాదేళ్ల వేతనం... ప్రోత్సాహకం తగ్గించారా?

టెక్ సంస్థల సీఈవోల వేతనాలు ఏస్థాయిలో ఉంటాయనే విషయంలో చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 12:30 PM GMT
భారీగా పెరిగిన సత్య నాదేళ్ల వేతనం... ప్రోత్సాహకం తగ్గించారా?
X

టెక్ సంస్థల సీఈవోల వేతనాలు ఏస్థాయిలో ఉంటాయనే విషయంలో చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. ఏడాదికి వందల కోట్ల రూపాయల వేతనాలు అందుకుంటూ ఉంటారు. ఈ సమయంలో తాజాగా ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల జీతం పెరిగింది. అది కూడా గత ఏడాదితో పోలిస్తే భారీ స్థాయిలో!

అవును... మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల వార్షిక వేతనం పెరిగింది. ఇందులో భాగంగా... ఆయన 2024 ఆర్థిక సంవత్సరానికి 79.1 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,65,00,00,280) వేతనం అందుకోనున్నారు. కాగా.. గత ఆర్థిక సంవత్సరంలో 48.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,04,74,73,681) వేతనంగా తీసుకున్నారు.

వాస్తవానికి జూన్ తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ లో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో దూసుకెళ్లింది. ఇందులో భాగంగా... కంపెనీ షేర్లు సుమారు 31.2 శాతం లాభపడ్డాయి. ఫలితంగా... మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లను దాటింది. దీంతో.. సత్య నాదెళ్ల స్టాక్ అవార్డులు $38 మిలియన్ల నుంచి $71 మిలియన్లకు పెరిగాయి.

అయితే... మైక్రోసాఫ్ట్ లో అందించిన సేవలకు గానూ సత్య నాదెళ్లకు $10.7 మిలియన్ల వరకూ నగదు ప్రోత్సాహకం అందాల్సి ఉండగా.. $5.2 మిలియన్లు అందనున్నట్లు కంపెనీ ఫైలింగ్ చేసిందని అంటున్నారు! దీంతో... ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అనేక సైబర్ సెక్యూరీటీ ఉల్లంఘనల కారణంగా ఈ ప్రోత్సాహకం తగ్గినట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి!!