Begin typing your search above and press return to search.

వైఎస్సార్ పేరు మార్చాల్సిందే !

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కడప నుంచి కడపను తప్పించేసింది అని అప్పట్లో విపక్షాలు విమర్శలు చేశాయి.

By:  Tupaki Desk   |   4 Oct 2024 2:56 PM GMT
వైఎస్సార్ పేరు మార్చాల్సిందే !
X

ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు మీద కడప జిల్లాకు ఆయన పేరు పెట్టారు. అయితే వైఎస్సార్ కడప జిల్లాగా అప్పట్లో దాని పేరు పెట్టారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కడప నుంచి కడపను తప్పించేసింది అని అప్పట్లో విపక్షాలు విమర్శలు చేశాయి.

కడపకు ఎంతో చరిత్ర ఉందని కడప కాదు అది దేవుడి గడప అని ఆ శ్రీవారి గడప అని కూడా చెప్పుకొచ్చారు. చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన కడప పేరుని తీసేయడం ఏంటి అని కూడా ఫైర్ అయ్యారు. ఆ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కడప పేరుని తప్పించడం పట్ల పెద్ద చర్చ సాగింది. ఆనాడే మంత్రి సత్య కుమార్ కడప పేరుని కూడా తగిలించాలని కోరారు. ఇపుడు ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.

వైఎస్సార్ కడప జిల్లాగా దాని పేరు పునరుద్ధరించాలని అందులో కోరారు. గత వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం అవగాహన లేకుండా కడప పేరుని తీసేసింది అని అన్నారు. దేవుడి గడపగా కడప ఉందని గుర్తు చేశారు అంతే కాదు చరిత్రలోకి వెళ్తే కృపాచార్యులు అనే భక్తుడు తీర్ధయాత్రలు చేస్తూ కడప ఉన్న ప్రాంతానికి వచ్చారని ఆయన శ్రీవారి దర్శనం చేసుకోలేక అక్కడే ఆగిపోయారని ఆయనను కరుణించడానికి శ్రీవారే సాక్షాత్కరించారని కూడా సత్యకుమార్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు

ఇక కృపాచార్యుల పేరు మీద ఈ ప్రాంతం కృపావతిగా అనంతర కాలంలో కుడపగా అలా జనం నోళ్ళలో కడపగా మార్పు చెందిందని సత్యకుమార్ చెప్పారు. ఇంతటి విశిష్టత కలిగిన కడప పేరుని తొలగించాలనుకోవడం దారుణం అన్నారు

కడప ప్రఖ్యాతిని చారిత్రాత్మకమైన ప్రాశస్త్యాన్ని గుర్తు చేసుకునేలా వైఎస్సార్ కడప జిల్లాగా మార్పు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునేలా ఉందని అంటున్నారు

తొందరలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి, దాంతో ఆ సమావేశాలలోనే కడప పేరుని కూడా జోడించి కొత్తగా తీర్మానం చేస్తారని అంటున్నారు. వైఎస్సార్ కడప జిల్లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీలో నిర్ణయించింది. మరి దానిని మార్చాలని ఎలా అనుకున్నారో అని చరిత్రకారులు కూడా అంటున్నారు.

ఎపుడో యాభై అయిదేళ్ళ క్రితం ఒంగోలు గుంటూరు నుంచి విడదీసి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేసినా దానిని ఒంగోలు అని కూడా పిలుస్తున్నారు అంటే చారిత్రక ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకునే అని అంటున్నారు. ఇక జిల్లాల పేర్లు అన్నవి చరిత్ర నుంచే పుట్టాయని వాటిని మార్చే సాహసం చేయవద్దని కూడా చరిత్రకారులు కూడా కోరుతున్నారు. ఇపుడు వైఎస్సార్ కడప జిల్లా అన్నా కూడా దివంగత నేతకు ప్రాధాన్యత తగ్గినట్లు కానే కాదని అంటున్నారు. సో మరి ఈ నిర్ణయం కనుక కూటమి ప్రభుత్వం తీసుకుంటే వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.