4,000 ఏళ్ల నాటి పురాతన కోట వెలుగులోకి.. ఎక్కడ ఉందంటే..!
ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త గుయిలౌమ్ చార్లౌక్స్ నేతృత్వంలోని బృందం చేసిన పరిశోధన ప్రకారం ఆ ప్రదేశంలో పురాతన 14.5 కిలోమీటర్ల పొడవైన గోడను కనుగొన్నారు.
By: Tupaki Desk | 3 Nov 2024 3:30 PM GMTసౌదీ అరేబియాలో అద్భుతం చోటుచేసుకుంది. ఆధునిక కాలంలో ఒయాసిస్‌లో దాగి ఉన్న 4,000 ఏళ్ల నాటి పునరాతనమైన కోట వెలుగుచూసింది. అల్-నాతాహ్ అని పిలువబడే ఈ పట్టణం గోడల ఒయాసిస్ ద్వారా చాలాకాలం పాటు దాచుకున్నాయి. పురాతన కోటను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త గుయిలౌమ్ చార్లౌక్స్ నేతృత్వంలోని బృందం చేసిన పరిశోధన ప్రకారం ఆ ప్రదేశంలో పురాతన 14.5 కిలోమీటర్ల పొడవైన గోడను కనుగొన్నారు. క్రీ.పూ. 2400 సంవత్సరంలో అక్కడ 500 మంది నిర్వాసితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మనషి సంచార జీవనశైలి నుంచి పట్టణ జీవనశైలికి క్రమంగా మారడాన్ని దీనిని చూస్తే అర్థం చేసుకోవచ్చని శాస్త్రేవేత్తలు అంటున్నారు.
దాదాపు వెయ్యి ఏళ్ల తరువాత దీనిని వదిలివెళ్లినట్లుగా ఆర్కిటెక్చరల్ నిపుణులు చార్లక్స్ తెలిపారు. అల్-నాతాహ్ నిర్మించినప్పుడు సిరియా నుంచి జోర్డాన్ వరకు మధ్యధరా సముద్రం వెంబడి లెవాంట్ ప్రాంతంలో నగరాలు అభివృద్ధి చెందాయి. ఖైబర్ అనే పూర్తి ఎడారి ప్రాంతం కాగా.. సంచార జాతులు ఎక్కువ జీవించేవారని తెలుస్తోంది. ఈ ఏరియా పూర్తిగా శ్మశాన వాటికలతో నిండి ఉండడాన్ని చూడొచ్చు.
పునరాతన కోటతో కూడిన ఈ పట్టణం సంచార ఉనికి నుంచి స్థిరపడిన జీవనశైలికి ప్రారంభ కాంస్య యుగంతో నేరుగా సంబంధం కలిగి ఉంది. ఫ్రెంచ్-సౌదీ బృందం సైట్ యొక్క వైమానిక సర్వేలను నిర్వహించింది. 50 వేర్వేలు నివాసాలు, 14.5 కిలోమీటర్ల పొడవైన గోడను కలిగి ఉంది. దట్టమైన క్లస్టర్డ్ నిర్మాణం ఫొటోలను ఈ సర్వే బృందం సేకరించింది. సైట్ సుమారు 2.6 హెక్టార్లలో కలిగి ఉన్నట్లు వెల్లడించింది. ఇది స్థిరవాసుల ప్రణాళికబద్ధమైన నగరమని, అక్కడి మౌలిక సదుపయాలు, వారి రక్షణ, సామాజిక పరస్పర చర్యలను చూపుతున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు బసాల్ట్ అని పిలువబడే నల్లని అగ్నిపర్వత శిలలు అల్-నతాహ్ గోడలను కనిపించకుండా చేశాయి. అక్రమ తవ్వకాల ద్వారా ఈ కట్టడం ఇప్పుడు బయటపడింది.