ఎర్ర సముద్రపు నీటి అడుగున పగడపు దిబ్బల మధ్య పెళ్లి... వీడియో వైరల్!
అవును... సౌదీ అరేబియాకు చెందిన ఓ జంట రోటీన్ కి భిన్నంగా తన వివాహాన్ని జరుపుకుంది.
By: Tupaki Desk | 24 Oct 2024 10:30 PM GMTపెళ్లి అనేది ఓ అద్భుతమైన వేడుక. దీన్ని ఎవరి స్థోమత మేరకూ వాళ్లు ఉన్నంతలో అంగరంగ వైభవంగా చేసుకోవాలని కోరుకుంటారు. ఈ సమయంలో డెస్టినేషన్ వెడ్డింగుల కోసం సముద్ర తీరాలు, రాజ కోటలు, పర్వత శిఖరాలు వంటి ప్రదేశాలను ఎంచుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా సముద్రం అడుగున పెళ్లి చేసుకుందోజంట.
అవును... సౌదీ అరేబియాకు చెందిన ఓ జంట రోటీన్ కి భిన్నంగా తన వివాహాన్ని జరుపుకుంది. తమ పెళ్లి సరికొత్త ట్రెండ్ ను సృష్టించేలా చేసుకుంది. ఇందులో భాగంగా ఎర్ర సముద్రంలో వివాహం చేసుకుంది. వాస్తవానికి వీరి పెళ్లి.. ఆ సముద్రం ఒడ్డున జరగాల్సి ఉంది. అయితే... ఈ జంట మాత్రం ఊహించని విధంగా సముద్రపు అడుగుభాగంలో పెళ్లి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో హసన్ అబు అల్ ఓలా, యాస్మిన్ దఫ్తాదార్ అనే జంట ఎర్ర సముద్రంలో వివాహం చేసుకుంది. ఈ సమయంలో స్థానిక డైవింగ్ టీమ్ దీన్ని నిర్వహించింది. సముద్రంలో డైవ్ చేయడానికి కావాల్సిన ప్రాథమిక వస్తువులను ఈ జంటకు డైవింగ్ టీమ్ అందించింది. ఈ సందర్భంగా.. వధూవరులిద్దరూ తెల్లటి దుస్తుల్లో కనిపించారు.
ఈ సందర్భంగా స్పందించిన వరుడు హసన్... ఇది ఏమాత్రం ఊహించని, అద్భుతమైన విషయం అంటూ తన ఆనందోత్సాహాలను పంచుకున్నారు. తాము బీచ్ లో వివాహానికి ప్రిపేర్ అయిన తర్వాత కెప్టెన్ ఫైసల్, అతని టీమ్ సముద్రం కింద వివాహ వేడుకను ప్లాన్ చేసినట్లు చెప్పి షాకిచ్చారని.. ఇది ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం అని అన్నారు.