మేటర్ సీరియస్... అర్జున అవార్డ్ గ్రహీతకు వరకట్న వేధింపులు!
అవును... దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన సావీటీ బూరాకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి.
By: Tupaki Desk | 27 Feb 2025 11:42 AM GMTఅత్యంత దారుణమైన ఘటన ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. మాజీ ప్రపంచ ఛాంపియన్, అర్జున అవార్డ్ గ్రహీత, భారత నెంబర్ వన్ బాక్సర్ అయిన సావీటీ బూరాకు ఊహించని సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఆమెకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు రావడం చర్చనీయాంశంగా మారింది.
అవును... దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన సావీటీ బూరాకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. ఈ సమయంలో... తన భర్త, అత్తింటి వారు తనను వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆసియాడ్ కాంస్య విజేత, కబడ్డీ ఆటగాడు దీపక్ హుడాపై, వరకట్న వేధింపుల కేసు నమోదు అయ్యింది.
కాగా.. సావిటీ బూర – దీపక్ హుడా 2022లో వివాహం చేసుకున్నారు. అయితే.. ఫిబ్రవరి 25న హర్యానాలోని హిసార్ లో దీపక్ హుడా వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని పోలీసులకు సావిటీ ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమె భర్త దీపక్, అతడి కుటుంబ సభ్యులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. ఈ మేరకు హిసార్ లోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది!
అయితే... హుడాకు రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. కానీ.. అతను హాజరు కాలేదని.. గాయం కారణంగా గైర్హాజరయ్యారని చెబుతున్నారు. దీంతో.. మెడికల్ సర్టిఫికెట్ సబ్ మిట్ చేశారని.. పోలీసులు వెల్లడించారు.
కాగా... 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొహం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దీపక్ హుడా పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన 2016లో దక్షిణాసియా క్రీడల్లో కబడ్డీలో బంగారు పథకం తో పాటు అంతకంటే ముందు 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్నారు.
ఇదే సమయంలో.. ప్రో కబడ్డి లీగ్ లోనూ పాల్గొన్నారు. అయితే.. ఇటీవల ఇరువురి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీ.ఎన్.ఎస్.లోని సెక్షన్ 85 కింద కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.