Begin typing your search above and press return to search.

బాండ్ల గుట్టు విప్పేందుకు ఎస్ బీఐ నో

పెను సంచలనంగా మారి.. ఎన్నికల వేళ మోడీ సర్కారుపై సూటిగా వేలెత్తి చూపేలా ఎన్నికల బాండ్ల వ్యవహారం మారిందంటున్నారు.

By:  Tupaki Desk   |   3 April 2024 6:30 AM GMT
బాండ్ల గుట్టు విప్పేందుకు ఎస్ బీఐ నో
X

పెను సంచలనంగా మారి.. ఎన్నికల వేళ మోడీ సర్కారుపై సూటిగా వేలెత్తి చూపేలా ఎన్నికల బాండ్ల వ్యవహారం మారిందంటున్నారు. ఇప్పటికే ఎన్నికల బాండ్ల లొల్లి దేశ వ్యాప్తంగా పెద్ద ఇష్యూ కావటం.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఒక హక్కుల కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఎస్ బీఐ ఇచ్చిన సమాధానం చూసినప్పుడు.. ఇప్పటికి గుట్టుగా ఉంచేస్తున్న ఎస్ బీఐ తీరు మరింత చర్చకు తెర తీస్తోంది.ఎన్నికల బాండ్ల అమ్మకాల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను తెలపాలన్న ఒక హక్కుల కార్యకర్త పిటిషన్ కు అంతే సూటిగా స్పందించింది ఎస్ బీఐ.

అంజలి భరద్వాజ అనే మహిళా హక్కుల కార్యకర్త రంగంలోకి దిగి.. ఒక సూటి ప్రశ్నను సంధించారు. ‘ఎన్నికల బాండ్ల అమ్మకాల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏమిటి? అని ప్రశ్నించింది. దీనికి సంబంధించి తాజాగా స్పందించిన ఎస్ బీఐ.. బాండ్ల అమ్మకాలు.. ఎన్ క్యాష్ కోసం బ్యాంకు బ్రాంచ్ లకుజారీ చేసిన ఎన్ వోపీ అనేది తమ సంస్థ అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుందని పేర్కొన్నారు.

బాండ్ల ఎన్ క్యాష్ కోసం బ్యాంకు బ్రాంచ్ లకు జారీ చేసిన వైనం తమ సంస్థ అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుందంటూ ఎస్ బీఐ పేర్కొంది. ఈ సందర్భంగా చట్టంలోని రూల్ పొజిషన్ ను వాడుకున్న ఎస్ బీఐ.. వాణిజ్య.. వ్యాపార రహస్యాలు వెల్లడికాకుండా కమర్షియల్.. కాన్ఫిడెన్స్ కింద ఆర్ టీఐ చట్టంలో మినహాయింపులు ఉన్నాయంటూ బదులిచ్చింది. ఈ సమాధానంపై అంజలి తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.

ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిన తర్వాత.. దీనికి సంబంధించిన అన్ని వివరాలు బహిర్గతం చేయాలన్న ఈసీ వ్యాఖ్యలను కోట్ చేస్తోంది. ఎన్నికల బాండ్ల గుట్టుమట్లు మరింత లోతుల్లోకి వెళ్లి.. దాని గుట్టును బయటకు రట్టు చేయటమన్నట్లుగా ఉన్న అంజలీ మరెన్ని కొత్త అంశాల్ని తెర మీదకు తీసుకొస్తుందో చూడాలి.