Begin typing your search above and press return to search.

రెస్టారెంట్లకు రేటింగ్ ఇవ్వమన్నారు... రూ.13 లక్షలు కాజేశారు!

అవును... పార్ట్ టై జాబ్ కోసం వెతుకుతున్న చాలా మంది వ్యక్తులు ఇలా సైబర్ నేరాల బారిన పడుతున్నారు! ఈ క్రమంలో తాజాగా ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కింది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 2:45 AM GMT
రెస్టారెంట్లకు రేటింగ్  ఇవ్వమన్నారు... రూ.13 లక్షలు కాజేశారు!
X

దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రతీరోజూ ఏదో ఒకమూల ఈ సైబర్ నేరాలకు చెందిన వార్తలు వస్తూనే ఉన్నాయి. విచిత్రంగా బాగా చదువుకుని, ఐటీ జాబ్ లు చేస్తున్నవారే ఎక్కువగా వీరి వలలకు చిక్కుతుండటం గమనార్హం. ఇందులో మరి ముఖ్యంగా పార్ట్ టైం జాబ్ ల కోసం చూసేవారు ఎక్కువగా బలైపోతుండటం గమనార్హం.

అవును... పార్ట్ టై జాబ్ కోసం వెతుకుతున్న చాలా మంది వ్యక్తులు ఇలా సైబర్ నేరాల బారిన పడుతున్నారు! ఈ క్రమంలో తాజాగా ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కింది. ఫలితంగా... సుమారు రూ.13 లక్షలకు పైగా నష్టపోయింది. ఆఖరికి తాను మోసపోయినట్లు తెలుసుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఈ క్రమంలో... ఆమె అదనపు ఆదాయం కోసం నెట్ లో పార్ట్ టైం జాబ్ గురించి సెర్చ్ చేసింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెకు ఫోన్ చేశారు. తమది పార్ట్ టైం జాబ్స్ ఆఫర్ చేసే కంపెనీ అని.. ఇందులో భాగంగా ఆన్ లైన్ లో హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుందని ఆమెకు చెప్పారు. అందుకు రేటింగ్ ఇచ్చిన ప్రతిసారి రూ.150 చెల్లిస్తామని వివరించారు.

దీంతో పార్ట్ టైం జాబ్ దొరికిందని హ్యాపీ ఫీలయిన ఆమె... వారు చెప్పిన హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో... చేసిన పనికి ఆమెకు వారు డబ్బులు చెల్లించారు. ఇలా కొద్ది రోజులు కరెక్ట్ గా డబ్బులు పేమెంట్ చేసిన వారు... తమ వద్ద పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ అవుతాయని చెప్పారు. దీంతో ఆశపుట్టిందో.. లేక, అత్యాశకు బెమ పడిందో తెలియదు కానీ... ఆమె పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టింది.

అయితే ఆన్ లైన్ యాప్ లో ఆ డబ్బులు కనిపిస్తున్నా... విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం రాలేదు. ఈ సమయంలో వారికి ఫోన్ చేయగా.. మరింత పెట్టుబడి పెట్టాలని కోరారు. అయితే... అప్పటికే తనవద్ద ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయని, ఇప్పటికే రూ.13.76 లక్షలు పెట్టుబడి పెట్టానని.. తన డబ్బులు తనకు కావాలని కోరింది. దీంతో... ఆ వ్యక్తులు ఫోన్ స్విచ్చాఫ్ చేశారు.

దీంతో... మోసపోయానని తెలిసుకున్న బాధిత మహిళ సైబర్ పోలీసులు ఫిర్యాదు చేసింది. తాను ఇంతకాలం ఫోన్ కాన్వర్ చేసింది సైబర్ నేరగాళ్లతో అని గ్రహించి బోరున విలపిస్తుందంట! దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ సెల్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారని తెలుస్తుంది. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని.. ఆన్ లైన్ లో మాయల్లో పడొద్దని కోరుతున్నారు.