జర్మనీలో 6.23 లక్షల రాత్రులు గడిపిన ఇండియన్స్!
ఈ సందర్భంగా... జర్మన్ నేషనల్ టూరిస్ట్ బోర్డ్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది
By: Tupaki Desk | 10 Aug 2023 6:57 AM GMTస్కెంజెన్ వీసా... ఐరోపాలోని స్కెంజెన్ ప్రాంతంలోని అందమైన 27దేశాలను అన్వేషించడానికి అనుమతించే ప్రత్యేకమైన అనుమతి. జర్మనీకి వెళ్లేందుకు స్కెంజెన్ వీసా ప్రాసెసింగ్ సమయాన్ని ఎనిమిది వారాలకు తగ్గించామని, దానిని మరింత తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇక్కడి జర్మన్ ఎంబసీ వెల్లడించింది.
ఈ సందర్భంగా... జర్మన్ నేషనల్ టూరిస్ట్ బోర్డ్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... 2022లో భారతీయులు జర్మనీలో చాలా రాత్రులు గడిపారని.. ఖచ్చితంగా చెప్పాలంటే 6.23 లక్షల రాత్రులు గడిపారని తెలిపారు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 209 శాతం పెరుగుదల కాగా... కోవిడ్ సమయానికి ముందు కంటే 65 శాతం తక్కువ అని తెలిపారు.
స్కెంజెన్ వీసా అనేది టూరిజం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం యూరప్ లోని 27 దేశాల స్కెంజెన్ ఏరియాలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించడానికి ఒక వ్యక్తిని అనుమతించే స్వల్పకాల (90 రోజుల) వీసా. అయితే ఈ వీసా ప్రాసెసింగ్ లో జాప్యం కారణంగా యూరప్ టూరిజం ఈ మధ్య మందగించిందట.
కాగా... ఎక్కువ మంది వ్యక్తులు ఈ వీసాను కోరుకుంటున్నందున, రాబోయే రెండు వారాల్లో పర్యటనలను ప్లాన్ చేసుకునే వారికి కొన్ని సలహాలు ఉన్నాయంటూ ఈ ఏడాది ఏప్రిల్ ల్లో జర్మన్ ఎంబసీ సలహాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్లాన్ లను కొంచెం ఆలస్యం చేయడం మంచిదని తెలిపింది.