Begin typing your search above and press return to search.

సర్ ప్రైజ్: గుండెలోనూ చిట్టి బ్రెయిన్!

స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇన్ స్టిట్యూట్.. కొలంబియా వర్సిటీలకు చెందిన సైంటిస్టులు ఈ కొత్త అంశాన్ని గుర్తించారు.

By:  Tupaki Desk   |   11 Dec 2024 4:20 AM GMT
సర్ ప్రైజ్: గుండెలోనూ చిట్టి బ్రెయిన్!
X

గుండె ఒకలా.. మెదడు మరోలా చెప్పటం.. ఇదే విషయాన్ని మాటల్లో చాలామంది చెబుతుంటారు. కానీ.. లాజిక్ చెప్పే బ్రెయిన్.. ఎమోషన్ ను మాత్రమే చెప్పే గుండె వేర్వేరుగా చెప్పటం కనిపిస్తూ ఉంటుంది. అయితే.. ఎమోషన్ ను మాత్రమే పండించే గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉందన్న సరికొత్త ఆవిష్కరణ ఇప్పుడు బయటకు వచ్చింది. అందరిని ఆశ్చర్యానికి గురి చేసే ఈ కొత్త అంశం గుండెలోని సంక్లిష్టంగా ఉండే వ్యవస్థను సరికొత్తగా గుర్తించినట్లైందన్నది చెప్పాలి.

స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇన్ స్టిట్యూట్.. కొలంబియా వర్సిటీలకు చెందిన సైంటిస్టులు ఈ కొత్త అంశాన్ని గుర్తించారు. ఇప్పటివరకు మనిషి శరీరం మొత్తంలో ఒకటే మెదడు ఉంటుందని.. దాని సూచనల ఆధారంగానే మిగిలిన వ్యవస్థలు నడుచుకుంటాయని నమ్మేవారు. అయితే.. ఇది నిజం కాదని.. గుండెలోనూ చిట్టి బ్రెయిన్ ఉంటుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండెను ఆటోనామిక్ నెర్వస్ సిస్టమ్ ఒక్కటే కంట్రోల్ చేస్తుందన్న భావన ఎంతోకాలంగా ఉంది. ఈ వ్యవస్థ మెదడు నుంచి సంకేతాల్ని పంపుతుందని భావించేవారు.

గుండె గోడల పైపొరల కింద నెర్వస్ నెట్ వర్కు ఉంటుంది. ఇది గుండెనుంచి సంకేతాల్ని బట్వాడా చేసే ఒక సాధారణ వ్యవస్థగా భావించేవారు. అయితే.. ఇప్పటివరకు ఉన్న అంచనాలు.. అభిప్రాయాలకు మించి మెరుగైన విధులను నిర్వర్తిస్తుందన్న కొత్త విషయాన్ని తాజా పరిశోధన స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ మినీ బ్రెయిన్ లా వ్యవహరిస్తుందన్న విషయాన్ని గుర్తించారు.

తలలోని మెదడు.. కదలికలు.. శ్వాస లాంటి లయబద్ధ విధులను నియంత్రిస్తున్న రీతిలోనే గుండెలోని ఈ చిట్టి బ్రెయిన్ హార్ట్ స్పందనలను కంట్రోల్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించారు. గుండెలోని భిన్నరకాల నాడీ కణాలను సైంటిస్టులు గుర్తించారు. వాటికి వేర్వేరు బాధ్యతలు ఉన్న విషయాన్ని కనుగొన్నారు. కొన్ని న్యూరాన్ల సమూహానికి గుండె లయను స్థిరంగా ఉంచే పేస్ మేకర్ లక్షణాలూ ఉన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు జీబ్రా ఫిస్ పై తాము చేసిన పరిశోధనలతో గుర్తించారు.

జీబ్రా ఫిష్ ప్రత్యేకత ఏమంటే.. దీని గుండె స్పందన రేటు.. ఇతరత్రా అంశాలు మనిషి గుండెను పోలి ఉంటాయి. దీంతో.. దీని సాయంతో గుండెలోని మినీ మెదడు వ్యవస్థను మరింత మెరుగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధనతో గుండెకు సంబంధించిన కొత్త విషయాలు కనుగొనవచ్చని భావిస్తున్నరు. గుండె కొట్టుకునే రేటులో తీవ్ర హెచ్చుతగ్గులు లాంటి రుగ్మతలకు కొత్త ట్రీట్ మెంట్ ను డెవలప్ చేయొచ్చన్నది ఆలోచన. మొత్తంగా చూస్తే మనిషికి రెండు మెదడు (గుండెలో ఉండేది మెదడు పోలిన వ్యవస్థ మాత్రమే)లు ఉన్న విషయం తాజా ఆవిష్కరణ గుర్తించిందని చెప్పాలి.