Begin typing your search above and press return to search.

ఇండియన్స్ పై యూఎస్ పోలీసు నిజస్వరూపం... మరణంపై వెకిలి కామెంట్స్!

అమెరికాలోని సియాటెల్‌ లో పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ చేసిన యాక్సిడెంట్‌ లో ఒక తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతిచెందిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   13 Sep 2023 9:36 AM GMT
ఇండియన్స్ పై యూఎస్ పోలీసు నిజస్వరూపం... మరణంపై వెకిలి కామెంట్స్!
X

అమెరికాలోని సియాటెల్‌ లో పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ చేసిన యాక్సిడెంట్‌ లో ఒక తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆమె ప్రాణాలకు విలువ లేదంటూ, నవ్వుతూ, సదరదాగా దర్యాప్తు అధికారి చేసిన వ్యాఖ్యలపై రచ్చ జరుగుతోంది.

అవును... సియాటెల్ లో తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మరణానికి కారణమైన ఘటనపై సరదాగా జోకులు వేస్తూ.. ఇండియన్ స్టూడెంట్స్ ప్రాణాలకు విలువ లేదంటూ ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సదరు పోలీసు అధికారికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

వివరాళ్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 23 సంత్సరాల కందుల జాహ్నవి సౌత్ లేక్‌ లోని నార్త్‌ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఈ సమయంలో... ఈ ఏడాది జనవరి 23న థామస్ స్ట్రీస్‌ లోని డెక్స్‌టర్ అవెన్యూ నార్త్ సమీపంలో రోడ్డుపై నడుస్తుండగా కెవిన్ డేవ్ అనే సీటెల్‌ కు చెందిన పోలీసు అధికారి నడుపుతున్న కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొంది.

ఈ ప్రమాదంలో జాహ్నవి తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. సరిగ్గా ఆ సమయంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై సియాటెల్‌ పోలీసు అధికారుల గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్‌ కారు నడుపుతూ చేసిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇందులో భాగంగా... గిల్డ్ అధ్యక్షుడు మైక్ సోలన్‌ తో ఫోన్‌ లో మాట్లాడుతూ... ఆమె విలువ చాలా తక్కువ అంటూ, ఆమె ప్రాణానికి అసలు విలువే లేదంటూ ఎగతాళిగా కామెంట్‌ చేశాడు. ఇదే సమయంలో ఆమె చనిపోయింది అంటూ గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడు. అనంతరం... ఇదంతా మామూలే అంటూ ఇండియన్ మరణాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశాడు.

ఇదే క్రమంలో... ఆమెకు 26 ఏళ్లు.. 11,000 డాలర్లకు చెక్ రాస్తే చాలు.. ఆమెకు విలువ తక్కువ అంటూ ఆడెరర్‌ చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో వినిపిస్తున్నాయి. దీంతో... భారతీయ విద్యార్థిని పట్ల ఒక అమెరికన్ పోలీసుకు ఉన్న చిన్న చూపు.. ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది.

దీంతో... ఈ వీడియోపై నెటిజన్లు, ప్రవాస భారతీయలు మండిపడుతున్నారు. ఇది అమెరికన్ పోలీసు రేసిజానికి నిదర్శనం అన్ని ఫైరవుతున్నారు. ఇది మానవత్వం ఉన్నవాళ్లు చేసేపని కాదంటూ నిప్పులు చెరుగుతున్నారు. అయితే... ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీటెల్ పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా... జాహ్నవి ని ఢీ కొట్టిన సమయంలో కారును గంటకు 50 మైళ్ల వేగంతో నడుపుతున్నాడని, అది చాలా తక్కువ వేగమని ఆడరర్ సర్టిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే... తర్వాత జరిపిన దర్యాప్తులో డేవ్ గంటకు 74 మైళ్ల వేగంతో కారు నడిపినట్లు తేలింది. అందువల్లే... కారు ఢీకొట్టడంతో జాహ్నవి సుమారు 100 అడుగుల దూరంలో ఎగిరిపడి మరణించింది.