సెబీ కొత్త ఛైర్మన్ కోసం వెతుకులాట.. శాలరీ ఎంతంటే?
సారధిగా బాధ్యతలు స్వీకరించాలని భావించే వారు 65 ఏళ్లు ఉండాలనిపేర్కొంది. అప్లికేషన్లను ఫిబ్రవరి 17 నాటికి తుది గడువుగాపేర్కొన్నారు.
By: Tupaki Desk | 28 Jan 2025 11:30 AM GMTసెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా)కి కొత్త సారధి కోసం వెతుకులాట మొదలైంది. అర్హులైన వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నియామక ప్రకటనను జారీ చేసింది. ప్రస్తుత ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న మాధవీపురీ బచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28నాటికి ముగియనుంది. ఈ లోపు కొత్త సారధి నియామకాన్ని పూర్తి చేయాలన్న ఆలోచనలో కేంద్ర ఆర్థిక శాఖ ఉంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ ను ఐదేళ్ల పదవీ కాలానికి ఎంపిక చేసేందుకు వీలుగా ప్రకటన జారీ చేశారు.
సారధిగా బాధ్యతలు స్వీకరించాలని భావించే వారు 65 ఏళ్లు ఉండాలనిపేర్కొంది. అప్లికేషన్లను ఫిబ్రవరి 17 నాటికి తుది గడువుగాపేర్కొన్నారు. ఈ నెలల అరవైఏళ్లలోకిఅడుగు పెట్టనున్న మాధవీ పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణల్ని ఎదుర్కొనటం తెలిసిందే. కొత్తగా ఎంపికయ్యే ఛైర్మన్.. సెబీ నిర్వహణ మీద ప్రభావం చూపే ఎలాంటి ఆర్థిక సంబంధిత వ్యవహారాలు ఉండకూడదని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది.
పాతికేళ్లకు మించిన అనుభవంతో పాటు.. యాభై ఏళ్లకు మించిన వయసు తప్పనిసరిగా పేర్కొంది. ఎంపికైన అభ్యర్థికి ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో నెలకు రూ.5.62 లక్షల జీతాన్ని ఇవ్వనున్నారు. సాధారణంగా సెబీ చీఫ్ తొలుత మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తుంది. అనంతరం మరో రెండేళ్లు పొడిగిస్తుంటారు.
గతంలో సెబీ ఛైర్మన్ గా వ్యవహరించిన యూకే సిన్హా పదవీ కాలాన్ని ఐదేళ్లు నిర్వహించిన తర్వాత మరో ఏడాది కూడా బాధ్యతలు చేపట్టారు. ఆసక్తికర అంశం ఏమంటే.. లక్షల కోట్ల మార్కెట్ లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకునే స్థానానికి నెల జీతం.. సీనియర్ ఐటీ ఉద్యోగి వేతనానికి దగ్గరగా ఉండటం చూసినప్పుడు విస్మయానికి గురయ్యేలా చేస్తుందని చెప్పాలి.