Begin typing your search above and press return to search.

కలెక్టర్లతో రేవంత్ మీటింగ్... సచివాలయంలో ఇంటర్నెట్ కట్!

తెలంగాణ సెక్రటేరియట్ కు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలుశాఖల్లో సేవలు నిలిచిపోయాయని అంటున్నారు

By:  Tupaki Desk   |   16 July 2024 9:24 AM GMT
కలెక్టర్లతో రేవంత్ మీటింగ్... సచివాలయంలో ఇంటర్నెట్ కట్!
X

తెలంగాణ సెక్రటేరియట్ కు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలుశాఖల్లో సేవలు నిలిచిపోయాయని అంటున్నారు. అయితే... బిల్లులు బకాయిలు ఉండటంతోనే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. 'నిపుణ ' నెట్ వర్క్ కు రూ.కోట్లలో బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో... ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.

అవును... తెలంగాణ సచివాలయంలో ఉన్నపలంగా ఇంటర్నెట్ ఆగిపోయిందని చెబుతున్నారు. దీంతో... పలు శాఖల్లో సేవలు నిలిచిపోయిన పరిస్థితి. వాస్తవానికి గత కొన్ని రోజులుగా... ఇంటర్నెట్ బకాయిలు చెల్లించాలని సర్వీస్ ప్రొవైడర్ విజ్ఞప్తి చేస్తుండట. అయినప్పటికీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని అంటున్నారు!

అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ఇంటర్నెట్ బంద్ చేసినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుందని అంటున్నారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు సీఎం దృష్టికి చేరే ఉంటుందని చెబుతున్నారు. మరోపక్క ఇదే సమయానికి రేవంత్ రెడ్డి.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

సరిగ్గా అదే సమయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగడంతో.. ఆ బకాయిలు క్లియర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా... జిల్లా కలెక్టర్లతో సమావేశంలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని.. సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే కలెక్టర్లు సరైన సేవలు అందించవచ్చని తెలిపారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకొవాలని అన్నారు.

ఇదే సమయంలో... ఏసీ గదులకు పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఇండదని కలెక్టర్లకు చెప్పిన రేవంత్ రెడ్డి... క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి కళ్లూ, చెవులూ కలెక్టర్లే అని స్పష్టం చేశారు. ఇలా కలెక్టర్లతో సీఎం సమావేశం జరుగుతున్న రోజే ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగడం గమనార్హం.