Begin typing your search above and press return to search.

నిర్మలమ్మ బడ్జెట్ చీర వెనక మర్మమేంటి ?!

అయితే ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రతిసారి ఒక్కో రంగు చీరను ధరిస్తున్నారు. ఆమె ఎందుకు అలాంటి చీరలే ధరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   12 July 2024 4:46 AM GMT
నిర్మలమ్మ బడ్జెట్ చీర వెనక మర్మమేంటి ?!
X

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మోడీ మూడో ప్రభుత్వంలో మరో సారి ఆర్థికమంత్రిగా నియమించబడ్డారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందిన నిర్మలమ్మ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలో పనిచేసింది. జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా ఉన్నప్పుడు 2010లో బీజేపీ వైపు అడుగులు వేసి అధికార ప్రతినిధిగా పనిచేస్తూ 2014లో ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో కీలకంగా వ్యవహరించింది.

ఆ తర్వాత మోడీ తొలి ప్రభుత్వంలో దేశంలో తొలి మహిళా రక్షణ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ ఆ తర్వాత 2019 నుండి మోడీ మలి ప్రభుత్వంలో, 2024 మోడీ మూడో ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తూ ఇప్పటికి ఆరుసార్లు దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

ఈ నెల 23న మరోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రతిసారి ఒక్కో రంగు చీరను ధరిస్తున్నారు. ఆమె ఎందుకు అలాంటి చీరలే ధరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

2019లో తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ స్థిరత్వం, తీవ్రతకు చిహ్నం అయిన గులాబీ రంగు పట్టు చీరను ధరించారు. 2020లో ఆనందం, శక్తికి ప్రతీక అయిన పసుపురంగు చీరను, 2021లో ఎరుపు అంచుతో కూడిన ఆఫ్ వైట్ కలర్ చీరను, 2022లో ఒడిశాలో సాంప్రదాయకంగా తయారు చేసే కాఫీ రంగు బొమ్కై చీరను, 2023లో ధైర్యం, ప్రేమ, నిబద్దత, బలానికి చిహ్నంగా నిలిచే ఎరుపు రంగు చీరను, 2024 మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు నీలం రంగు చీరను ధరించారు. భారత సాంప్రదాయం ఉట్టిపడేలా ఉండే ఆమె అహర్యానికి ప్రతిసారి ప్రశంసల జల్లు కురుస్తున్నది.