Begin typing your search above and press return to search.

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో రహస్య సొరంగం... వీడియో వైరల్!

ఇందులో భాగంగా... సద్దాం ఇంటిలో ఓ రహస్య సొరంగాన్ని పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ సొరంగం బంగ్లాదేశ్ సరిహద్దులకు దారితీసినట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   20 July 2024 3:36 AM GMT
భారత్-బంగ్లాదేశ్  సరిహద్దులో రహస్య  సొరంగం... వీడియో వైరల్!
X

బంగారం స్మగ్లింగ్ లో రొజురోజుకూ రకరకాల కొత్త పద్దతులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో... భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పోలీసులకు షాక్ చేస్తోంది కొత్త స్మగ్లింగ్ పద్దతి. పశ్చిమ బెంగాల్ పోలీసులు నకిలీ బంగారు విగ్రహాల కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో ఓ ఇంటిపై దాడి చేసినప్పుడు ఊహించని స్థాయిలో ఓ సొరంగం దర్శనమిచ్చింది.

అవును... పశ్చిమ బెంగాల్ పోలీసులు నకిలీ బంగారు విగ్రహాల కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో సౌత్ 24 పరగణాలలో కుల్తాలీలోని సద్దాం సర్దార్ అనే నిందితుడి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో... బెంగాల్ పోలీసులు సద్దాం భార్య మసూదా, సహచరుడు సాయిరుల్ భార్య రబియాలను అరెస్ట్ చేశారు. వీరికి పలు కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు!

నకిలీ బంగారు విగ్రహాల వ్యాపారి సద్దాం ప్రజలను మోసం చేసి దోచుకున్నాడని పోలీసులు ఆరోపించారు. సోషల్ మీడియాలో నకిలీ బంగారు విగ్రహాలను విక్రయించి, వ్యక్తుల నుండి డబ్బు తీసుకొని, వస్తువులను పంపిణీ చేయకుండా సర్దార్ చాలా మందిని మోసగించాడనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ పోలీసు చర్య జరిగిందని అంటున్నారు. ఈ సమయంలో ఇంటిపై దాడి చేయగా.. ఊహించని విషయం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... సద్దాం ఇంటిలో ఓ రహస్య సొరంగాన్ని పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ సొరంగం బంగ్లాదేశ్ సరిహద్దులకు దారితీసినట్లు చెబుతున్నారు. ఈ సొరంగం సుమారు 40 మీటర్ల పొడవు ఉంటుందని.. అది సద్దాం బెడ్ రూమ్ కింద నిర్మించారని వెల్లడించారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో షాకింగ్ గా ఉంది!

ఇటుకలు మరియు కాంక్రీటుతో నిర్మించిన ఈ సొరంగం 8-10 అడుగుల లోతు, 5-6 అడుగుల ఎత్తు, 4-5 అడుగుల వెడల్పుతో నిర్మించబడిందని చెబుతున్నారు. ఈ సొరంగం చిన్న ఇనుప గ్రిల్డ్ డోర్ ను కలిగి ఉందని.. మాట్లా నదిలోకి ప్రవహించే సమీపంలోని కాలువకు అనుసంధానించడానికి రూపొందించబడిందని స్థానిక వర్గాలు నివేదించాయని అంటున్నారు.

ఈ జలమార్గం ఇండో-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వైపు వెళుతుందని అంటున్నారు. సద్దాం, అతని సహచరులు కాలువ ఉండా తప్పించుకోవడానికి ఈ సొరంగం రూపకల్పన చేశారని అంటున్నారు. ఈ సొరంగం విషయం తెలుసుకున్న స్థానికులు షాక్ కి గురయ్యారు.