కీలక నిర్ణయం : ఏసీబీ న్యాయమూర్తికి భద్రత పెంపు!
టీడీపీ అధినేత చంద్రబాబు కేసుని విచారిస్తున్న విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 12 Sep 2023 2:14 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు కేసుని విచారిస్తున్న విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడు రోజులుగా ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసుని ఆమె విచారిస్తున్నరు.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు తొలిసారిగా బోనెక్కి మరీ తన తరఫున వాదన వినిపించుకున్నారు. తనకు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసుకు ఏ విధంగానూ సంబంధంలేదు అని బాబు వాదించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ మీద సేఐడి చార్జిషీట్ ని కొట్టి పారేయలేదు సరికదా ఆయనకు పద్నాలుగు రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ కి విధించింది.
ఇక బాబు హౌస్ కస్టడీ కోరితే ఆ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. జైలులోనే ఆయనకు సేఫ్ అని అభిప్రాయపడుతూ తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉంటే చంద్రబాబు కేసుకు సంబంధించి వస్తున్న పిటిషన్లను విచారిస్తున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందుకు ప్రభుత్వం ఒక్కసారిగా భద్రతను పెంచింది. ఫోర్ ప్లస్ వన్ సెక్యూరిటీని పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఈ పరిణామాలతో హై ప్రొఫైల్ కేసుగా చంద్రబాబు విచారణ ఉందని అర్ధం అవుతోంది. చంద్రబాబుని అరెస్ట్ చేయడం ఆషామాషీ కాదని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఆయన మూడు సార్లు సీఎం గా పనిచేశారని, ప్రతిపక్ష నేతగా ఉన్నారని అటువంటి బాబుని ఎవరూ అంత ఈజీగా జైలులో వేయలేరని ఆమె అన్నారు.
బాబు అవినీతి చేశారు అన్న దాని మీద ఏపీ సీఐడీకి ఆధారాలు ఉండడం వల్లనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని హోం మంత్రి పేర్కొన్నారు. ఇదిల ఉంటే ప్రతిపక్షాల నిరసనలు శాంతియుతంగా చేయకుండా రెచ్చగొట్టే విధంగా చేయాలనుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మొత్తానికి చంద్రబాబు కేసు కాదు కానీ ఏపీలో క్షణానికో సంచలనంగా సాగుతోంది.