Begin typing your search above and press return to search.

మళ్లీ ట్రెండింగ్ లో సీమా హైదర్... ఈ పాక్ మహిళ గుర్తున్నారా?

2013లో సీమా హైదర్ నలుగురు పిల్లలతో కలిసి పాకిస్థాన్ నుంచి భారత్ లో ఉన్న ఆన్ లైన్ ప్రేమికుడు సచిన్ మీనా కోసం రావడంతో తీవ్ర సంచలనం సృష్టించింది.

By:  Tupaki Desk   |   18 March 2025 4:57 PM IST
మళ్లీ ట్రెండింగ్  లో సీమా హైదర్... ఈ పాక్  మహిళ గుర్తున్నారా?
X

ఆన్ లైన్ లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్ నుంచి భారత్‌ లోకి అక్రమ మార్గంలో అడుగుపెట్టిన సీమా హైదర్‌ గురించి ఇప్పుడు పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. గతకొంతకాలంగా జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియా, సోషల్ మీడియా అనే తారతమ్యాలేమీ లేకుండా... ఎక్కడ చూసినా ఈమె గురించిన చర్చే జరిగిందన్నా అతిశయోక్తి కాదు!

2013లో సీమా హైదర్ నలుగురు పిల్లలతో కలిసి పాకిస్థాన్ నుంచి భారత్ లో ఉన్న ఆన్ లైన్ ప్రేమికుడు సచిన్ మీనా కోసం రావడంతో తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పట్లో ఆమె గురించి రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారారు. అందుకు కారణం.. ఆమె ఐదో బిడ్డకు జన్మనివ్వడమే!

అవును... భారత్ లో ఉన్న ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో పాక్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ జీవితంలో మరో గుడ్ న్యూస్ కలిగింది! ఇందులో భాగంగా.. సీమా హైదర్ – సచిన్ మీనా దంపతులకు ఈ నెల 18 (మంగళవారం) ఆడపిల్ల జన్మించింది. దీంతో.. మరోసారి ఈ జంట కు సంబంధించిన వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

కాగా... ఆన్ లైన్ లో సీమా హైదర్ - సచిన్ మీనా మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారిన సంగతి తెలిసిందే! దీంతో... ప్రేమించినవాడి కోసం సీమ తన నలుగురు పిల్లలను తీసుకుని నేపాల్ మీదుగా భారత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే.. అప్పటికే వీరిద్దరూ నేపాల్ లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు.

ఈ క్రమంలో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన విషయానికి సంబంధించి కేసులు, బెయిల్ మొదలైన పరిణామాల అనంతరం పరిస్థితులు కాస్త సానుకూలంగా మారడంతో.. వీరిరువురూ ఉత్తరప్రదేశ్ లోని నొయిడాలో నివాసం ఉంటున్నారు. ఇక.. సీమా హైదర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారని.. ఆమె సంపాదన కూడా బాగుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా సీమా హైదర్.. ఐదో బిడ్డకు జన్మనిచ్చిందని ఆమె లాయర్ వెళ్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన సీమా-సచిన్ ల న్యాయ సలహాదారు... మార్చి 18న ఈ దంపతులకు ఆడపిల్ల జన్మించింది.. ఆస్పత్రిలో డెలివరీ అయ్యింది అని తెలిపారు.