భారత జెండా ఎగురవేసిన పాక్ మహిళ.. వీడియో వైరల్!
ఇదే సమయంలో ఒక ఉగ్రవాదై సోదరుడు కూడా భారత జెండా ఎగరవేయడం గమనార్హం!
By: Tupaki Desk | 14 Aug 2023 10:06 AM GMTభారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఊహించని విధంగా పాకిస్థాన్ నుంచి పబ్ జీ ప్రేమతో ఇండియాకు వచ్చిన మహిళ సీమా హైదర్ జాతీయ జెండా ఎగురవేసి... భారత్ మాతా కీ జై అని నినాదాలు చేసింది.
ఇదే సమయంలో ఒక ఉగ్రవాదై సోదరుడు కూడా భారత జెండా ఎగరవేయడం గమనార్హం! దీంతో... తాజాగా భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈ రెండు సంఘటనలకు సంబంధించిన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
పబ్జీలో ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడితో పరిచయమై అది కాస్త ప్రేమగా మారడంతో పాక్ నుంచి అక్రమంగా నలుగురు పిల్లలతో భారత్ వచ్చేసింది సీమా హైదర్ అనే మహిళ. గత కొన్నిరోజులుగా ఆమె తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా అభియాన్ లో ఆమె పాల్గొంది.
ఇందులో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందుతమ ఇంటిపై భారత జెండాను ఎగురవేసి వార్తల్లో నిలిచింది. తన భర్త సచిన్ మీనా, వారి తరఫున లాయర్ ఏపీ సింగ్ తో కలిసి నోయిడాలోని తన నివాసంలో జరిగిన "హర్ ఘర్ తిరంగా అభియాన్" లో పాల్గొంది. ఈ సందర్భంగా హిందుస్థాన్ జిందాబాద్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు కూడా చేసింది.
ఈ సందర్భంగా ఆమె తన సినిమా ఛాన్స్ ల పట్ల స్పందించింది. సినిమాలో నటించాలని బాలీవుడ్ డైరెక్టర్లు ఆమెను సంప్రదించగా వారిని "నో" చెప్పినట్లు తెలిపింది. దీంతో... సినిమా చేయవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో సినిమా చేయకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఉగ్రవాది సోదరుడు:
ఆ సంగతి అలా ఉంటే మరోవైపు కశ్మీర్ లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది జావెద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ సోపోర్ లోని తన నివాసం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కశ్మీర్ లోయలో భద్రతా సంస్థలు గాలిస్తున్న టాప్-10 ఉగ్రవాదుల జాబితాలో జావెద్ మట్టూ ఉన్నాడు.
ఈ సందర్భంగా... భారతీయులుగా తాము గర్వపడతామని, ఎప్పటికీ భారతీయులుగానే ఉంటామని ఆయన చెప్పిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అనంతరం.. త్రివర్ణ పతాకం ఎగురవేయడం గర్వకారణంగా భావిస్తున్నానని, బహిర్గత శక్తుల ప్రభావం తమపై లేదని రయీస్ మట్టూ తెలిపారు.
ఇదే సమయంలో 2009లో తన సోదరుడు తాను ఎంచుకున్న మార్గంలో వెళ్లిపోయాడు. అప్పట్నించి సమాచారం లేదు అని చెప్పిన రయీస్ మట్టూ... ఇప్పటికీ తన సోదరుడు బతికి ఉంటే, తన ఆలోచనను మార్చుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తాము నిజమైన భారతీయులుగా మా మాతృభూమిలోనే జీవనం సాగిస్తాం మని చెబుతున్నాడు.