Begin typing your search above and press return to search.

సీతక్క, స్మిత సభర్వాల్,, ఆ కాలు మీద కాలేసుకొని కూర్చునే వివాదం ఏంటి?

మనదేశంలో ఉన్నతాధికారులు రాజకీయాల చుట్టూ తిరగాల్సిందే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారి సేవలో ఉండాల్సిందే.

By:  Tupaki Desk   |   13 March 2024 11:30 AM GMT
సీతక్క, స్మిత సభర్వాల్,, ఆ కాలు మీద కాలేసుకొని కూర్చునే వివాదం ఏంటి?
X

మనదేశంలో ఉన్నతాధికారులు రాజకీయాల చుట్టూ తిరగాల్సిందే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారి సేవలో ఉండాల్సిందే. దీంతో వారు పార్టీ మారినప్పుడల్లా కష్టాలు ఎదుర్కొంటుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులను ప్రాధాన్యం లేని రంగాలకు బదిలీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ పరిస్థితి ప్రస్తుతం అలానే మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో వెలిగిపోయిన ఆమె ప్రస్థానం ప్రస్తుతం మసకబారింది.

2014-2023 వరకు స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమె చెప్పిందే వేదం చేసిందే చట్టంలా పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆమెను బదిలీ చేయడంతో ఆమె ప్రాధాన్యం తగ్గిందని చెబుతున్నారు. మిషన్ భగీరథ అధికారిగా స్మితా సబర్వాల్ ఆమె హల్ చల్ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఆమెపై పలు రకాల వివాదాలు కూడా వచ్చాయి. కానీ దేన్ని లెక్కచేయకుండా ఆమె తన పని తాను చేసుకుంటూ పోయింది.

ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా తన ప్రభావం చూపించింది. తాను ఎవరికి భయపడాల్సిన పనిలేదని బుకాయించింది. చట్ట ప్రకారం తన విధులు నిర్వహిస్తున్నానని ప్రశ్నించింది.

స్మితా సబర్వాల్ పై చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆమెపై మరో వివాదం వెలుగులోకి వచ్చింది. మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా స్మితా సబర్వాల్ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ వయసులో తనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎలా కూర్చోవాలో నాకు తెలుసు. ఇందులో రచ్చ చేయడానికి ఏముందని స్మితా ప్రశ్నిస్తోంది. ఎప్పుడు వివాదాల్లో దూరడం ఆమెకు కొత్తేమీ కాదు.

ఈనేపథ్యంలో ఉన్నతాధికారుల ప్రవర్తన అప్పుడప్పుడు చిక్కుల్లో పడటం సహజమే. దీంతో స్మితా సబర్వాల్ పై ఇప్పుడు నడుస్తున్న రచ్చ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయినా ఆమె మాత్రం స్పందించడం లేదు. తాను కూర్చున్న విధానంపై ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదని చెబుతోంది. తన స్థాయి ఏమిటో తనకు తెలుసునని చెప్పడం కొసమెరుపు.