Begin typing your search above and press return to search.

మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్ పై కీలక అప్ డేట్!

ఈ సమయంలో ఏకంగా అసెంబ్లీలో మంత్రి మాట్లాడిన వీడియోనే మార్ఫింగ్ చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   2 Aug 2024 12:41 PM GMT
మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్  పై కీలక అప్  డేట్!
X

ఇటీవల కాలంలో వీడియో మార్ఫింగ్ భూతం తీవ్ర సమస్యగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు దీనికి బాధితులైన పరిస్థితి. ఈ సమయంలో ఏకంగా అసెంబ్లీలో మంత్రి మాట్లాడిన వీడియోనే మార్ఫింగ్ చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో భాగంగా... తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర మహిళా మంత్రి సీతక్క వీడియోను కొందరు ఆగంతకులు మార్ఫింగ్ చేశారు. ఆ వీడియోను మార్ఫింగ్ చేసి, సౌండ్ మర్చి, ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు! దీంతో... ఈ మార్ఫింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై తెలంగాణ అసెంబ్లీలో ఘాటైన చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే స్పందించిన సీఏం రేవంత్ రెడ్డి... మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా అంటూ ఘాటుగా స్పందించారు!

ఈ మార్ఫింగ్ వీడియోపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇందులో భాగంగా... సభలో ఏదో వీడియో తీసుకుని ఇష్టారాజ్యంగా పోస్టు చేస్తున్నారని, పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతు... చట్టసభల్లో ఫోటోలు, వీడియోలు తీయడం నేరమని.. దీనిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు.

మరోపక్క ఇలాంటి పనులకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైం పోలీసులకు న్యాయవాది వెంకట్ నాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో... ఈ ఫిర్యాదుపై స్పందించిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐటీఏ 2000-200 79, 33 (4), 353(1) బీ.ఎన్.ఎస్.యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కాగా... తెలంగాణ అసెంబ్లీలో గురువారం మంత్రి సీతక్క మాట్లాడుతుండగా... వెనకాలే కూర్చున్న పొన్నం ప్రభాకర్ తో పాటు మరో ఎమ్మెల్యే మాట్లాడుతున్న దృశ్యాలను కొందరు మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టి ట్రోలింగ్స్ చేశారు. ఈ నేపథ్యంలో... ఈ వీడియోలకు సంబంధించిన మీమ్స్ పై.. కాంగ్రెస్ పార్టీ సానుభూతుపరులు, ఈ నేతల అనుచరులు, ఘాటుగా స్పందిస్తున్నారు.