Begin typing your search above and press return to search.

చైనాకు రాకపోకలు వద్దు... బైడెన్ కు రిక్వస్ట్ ఎందుకంటే..?

అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ కు తాజాగా ఒక లేఖ అందింది. రిపబ్లికన్ సెనెటర్లు చైనా వైరస్ లపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు.

By:  Tupaki Desk   |   2 Dec 2023 1:30 PM GMT
చైనాకు రాకపోకలు వద్దు... బైడెన్  కు రిక్వస్ట్  ఎందుకంటే..?
X

అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ కు తాజాగా ఒక లేఖ అందింది. రిపబ్లికన్ సెనెటర్లు చైనా వైరస్ లపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. ఈ లేఖలు కీలక విషయాలను ప్రస్థావించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటన ప్రస్థావన తెచ్చారు. దీంతో ఈ రిక్వస్ట్ పై బైడెన్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. వీరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారా.. లేక, జాగ్రత్తలు చాలని అంటారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది!

అవును... కోవిడ్ అనంతరం ఇటీవల చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ చైనా వైరస్ చర్చ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇదే సమయంలో బ్యాక్టీరియల్‌ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్ఫెక్షన్‌.. యూఎస్ సహా పలు దేశాలను వణికిస్తోంది. దీంతో ఈ మిస్టరీ వ్యాధి పట్ల రిపబ్లికన్‌ సెనెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా చైనాకు రాకపోకలు బంద్ చేయమని లేఖ రాశారు.

ఈ లేఖలో కీలక విషయాలు ప్రస్థావించిన రిపబ్లికన్ సెనెటర్లు... చైనాలో శ్వాసకోశ వ్యాధి వేగంగా వ్యాప్తిస్తోందని తెలిపారు. ఇదే సమయంలో... ప్రజా ఆరోగ్య సంక్షోభం విషయంలో ఆ దేశం స్పష్టమైన సమాచారం బయటపెట్టదనే విషయం తెలిసిందే అంటూ... కరోనా సమయంలో ఆ దేశం వైరస్‌ మూలాల గురించి నిజాలను దాచిపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇదే క్రమంలో తాజాగా మరోసారి చైనాలో ఇన్ఫెక్షన్లు కలకలం రేపుతున్నాయని తెలిపారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకునేదాకా ఎదురుచూడకూడదని లేఖలో సెనేటర్లు సూచించారు. అందువల్ల... అమెరికన్ల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు తక్షణమే ఇరు దేశాల మధ్య ప్రయాణాలపై నిషేధం విధించాలని ఆ లేఖలో కోరారు.

దీంతో ఈ లేఖపై జో బైడెన్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి మొదలైంది. ఈ కొత్త వ్యాధి గురించి పూర్తిగా తెలిసేదాకా ఈ ఆంక్షలు కొనసాగాలని సెనెటర్లు కోరడంపై అగ్రరాజ్యంలో చర్చ జరుగుతుంది. వైరస్ సమస్య వస్తే ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టి పెను విపత్తుకు కారణం అవ్వడం చైనాకు కొత్త కాదనే విషయంతో చాలా మంది ఏకీభవిస్తున్నారని తెలుస్తుంది.

కాగా... చైనాలో నిమోనియా వ్యాప్తి కొత్త టెన్షన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రోజూ వందల సంఖ్యలో చిన్నారులు ఈ వ్యాది బారిన పడటంతో ప్రపంచ దేశాలు కరోనాని గుర్తుచేసుకున్నాయి. అయితే... అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ చెప్పుకొచ్చారు. అయితే... అవి నమ్మదగిన మాటలు కాదని యూఎస్ లోని రిపబ్లికన్ సెనెటర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో... అమెరికాలో ఇటీవల కొత్త రకం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు కాలిఫోర్నియా, ఫ్లోరిడా, అలాబామా, జార్జియా, న్యూ మెక్సికో, మిస్సిస్సిపీ, టెక్సాస్‌ సహా 11 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదైనట్లు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ గణాంకాలు చెబుతున్నాయి. పైగా ఈ వ్యాది ప్రధానంగా 3 - 8 ఏళ్ల చిన్నారులకు సోకుతోంది.