రాజ్యసభ సీన్ లోకి యనమల అశోక్ ?
టీడీపీ కూటమి చేతిలో రెండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. అవి ఖాళీ అయ్యాయని రాజ్యసభ ఆఫీసు నోటిఫికేషన్ జారీ చేసింది.
By: Tupaki Desk | 31 Aug 2024 3:42 AM GMTటీడీపీ కూటమి చేతిలో రెండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. అవి ఖాళీ అయ్యాయని రాజ్యసభ ఆఫీసు నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో ఈ రెండు పదవులకు పదింతలు మంది పోటీ పడుతున్నారు. పేర్లు చూస్తే చాలా ఎక్కువగానే ఉన్నాయి.
మొదట్లో జనసేనకు ఒక పదవి ఇస్తారు అని ప్రచారం సాగింది. కానీ ఇపుడు ఇవ్వరనే అంటున్నారు. తరువాత దశలోనే జనసేనకు వాటా ఉండొచ్చుట. సో దాని వరకూ ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే రెండు సీట్లూ టీడీపీకే దక్కుతాయన్న మాట.
మరి ఆ రెండు పోస్టులకు ఎవరిని చంద్రబాబు ఎంపిక చేస్తారు అన్నదే ఇపుడు అంతా తర్జన భర్జన పడుతున్నారు మాజీ ఎంపీ గల్లా జయదేవ్. అలాగే మరో మాజీ రాజ్యసభ మెంబర్ కంభంపాటి రామ్మోహనరావు పేర్లు ముందుకు వచ్చాయి. అలాగే వర్ల రామయ్య పేరు కూడా వినిపిస్తోంది.
అంతే కాదు నందమూరి కుటుంబం నుంచి దివంగత నేత హరికృష్ణ తనయ సుహాసిని పేరు కూడా పరిశీలిస్తారు అని అంటున్నారు. ఇలా చూసుకుంటే చాలా చిట్టా ఉంది. అయితే ఇపుడు ఈ లిస్ట్ లోకి మరి కొన్ని పేర్లు వచ్చి చేరాయి.
అందులో టీడీపీ పుట్టిన నాటి నుంచి ఉన్న ఇద్దరు సీనియర్ల పేర్లు ముందుకు వచ్చాయి. వారే యనమల రామక్రిష్ణుడు, అశోక్ గజపతిరాజు. ఈ ఇద్దరికీ బాబుతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. బాబు కూడా ఈ ఇద్దరికీ ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు.
క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ కి విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే ఆయన ఈ పాటికి కేంద్ర మంత్రి. దాంతో అశోక్ కూడా బాబుకు అపుడు సహకరించారు. టికెట్ల కేటాయింపులో ఒత్తిడి పెట్టకుండా బాబుకు ఫ్రీ హ్యాండ్ ఉండేలా చూశారు.
దాంతో అశోక్ కి న్యాయం చేయాలని బాబు అనుకుంటే ఆయనే రాజ్యసభ ఎంపీ అవుతారు అని అంటున్నారు. అలాగే నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్లమెంట్ లో ప్రవేశించాలని యనమల రామక్రిష్ణుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈసారి ఆయన కోరిక తీర్చాలని బాబు చూస్తున్నారు అని అంటున్నారు.
అసలు వీటి అన్నింటి కంటే ముఖ్య విషయం ఏంటి అంటే టీడీపీకి సీనియర్ల అవసరం ఢిల్లీలో పడింది. లోక్ సభలో గెలిచిన వారిలో అత్యధికులు కొత్తవారే కావడంతో బాబుకు సీనియర్ హ్యాండ్స్ కావాలని అంటున్నారు. పైగా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది
దాంతో కేంద్రం తో మరింత సాన్నిహిత్యం నెరుపుతూ ఏపీకి కావాల్సినవి చేయించుకునే ప్రయత్నం జరగాలంటే అనుభవం సీనియారిటీ ఉన్న వారు కావాలి. ఆ విధంగా చూస్తే యనమల రామక్రిష్ణుడు అశోక్ గజపతిరాజు ఈ లోటుని తీర్చగలరు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బాబు ఈ ఇద్దరికే కీలకమైన రాజ్యసభ ఎంపీ పదవులు కట్టబెడతారు అని అంటున్నారు.