Begin typing your search above and press return to search.

సీనియర్లకే మోడీ 3.0లో పెద్దపీట

సీనియర్లు జూనియర్లకు తమకున్న అనుభవాన్ని చెబితే కదా.. కొత్త తరం మరింత ప్రతిభావంతంగా వ్యవహరిస్తుంది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 6:32 AM GMT
సీనియర్లకే మోడీ 3.0లో పెద్దపీట
X

సీనియర్లు జూనియర్లకు తమకున్న అనుభవాన్ని చెబితే కదా.. కొత్త తరం మరింత ప్రతిభావంతంగా వ్యవహరిస్తుంది. ఈ చిన్న విషయాన్నిఅంత పెద్ద మోడీ ఎందుకు మిస్ అవుతున్నారు? కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువు తీరిన ప్రధానమంత్రి మోడీ తన పాత తీరునే ప్రదర్శించారు. తన విజన్ పాతికేళ్ల ముందు ఉంటుందని చెప్పే ఆయన.. ఫ్యూచర్ ను ఎప్పటికప్పుడు చూస్తుండాలని.. అప్పుడు మాత్రమే కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునే వీలు ఉంటుందని చెబుతారు. అలాంటప్పుడు ఆయన తన కేబినెట్ లో యూత్ కు ఎక్కువ ప్రాధాన్యం ఎందుకు ఇవ్వరు? అన్నది ప్రశ్న.

తాజాగా కొలువు తీరిన 72 మంది కేంద్ర మంత్రుల జాబితాను పరిశీలించినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఇదే విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటివ్ రిఫార్మ్స్ వెల్లడించింది. వయసు పరంగా చూస్తేమోడీ కేబినెట్ లో పెద్ద వయస్కులకు పెద్దపీట వేశారు మోడీ. మొత్తం 71 మంది మంత్రుల్లో 47 మంది 51-70 మధ్య వయస్కులుగా పేర్కొన్నారు.

అంతేకాదు 71-80 మధ్య వయస్కులు కేబినెట్ లో ఏడుగురు ఉండటం విశేషం. అంటే.. మొత్తం కేంద్ర మంత్రుల్లో పది శాతం మంది ఇంత పెద్ద వయస్కులు సొంతం చేసుకున్నారు. అదే సమయంలో 31-50 ఏళ్ల మధ్య వయస్కులు 17 మంది ఉన్నట్లుగా తేలింది. మొత్తం కేంద్ర మంత్రుల్లో వీరి వాటా 17 శాతంగా చెప్పాలి. అదే 30-40 ఏళ్ల వయస్కుల సంఖ్య చాలా అంటే చాలా చాలా తక్కువగా చెబుతున్నారు. యూత్ కు ఎక్కువ అవకాశాలు ఇవ్వటం ద్వారా వారి చురుకుదనాన్ని.. వారి విజన్ ను అర్థం చేసుకోవటంతో పాటు.. సీనియర్లు తమ అనుభవాన్ని రంగరిస్తే దేశం మరింత ముందుకు వెళుతుంది కదా? ఈ విషయాన్ని మోడీ మాష్టారు ఎప్పుడు గుర్తిస్తారు?