Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ కవిత కేసులో భారీ ట్విస్ట్...!

ఆమె కేసుని విచారణ చేస్తున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జస్టిస్ నాగ్ పాల్ అకస్మాత్తుగా బదిలీ అయ్యారు.

By:  Tupaki Desk   |   19 March 2024 6:03 PM GMT
ఎమ్మెల్సీ కవిత కేసులో భారీ ట్విస్ట్...!
X

బీఆర్ఎస్ మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కాం లో ఈడీ ద్వారా అరెస్ట్ అయి ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కేసుని విచారణ చేస్తున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జస్టిస్ నాగ్ పాల్ అకస్మాత్తుగా బదిలీ అయ్యారు.

ఆయన ప్లేఅస్ లో జస్టిస్ కావేరీ భావేజాని నియమించారు. ఇక నాగ్ పాల్ కవితకు కస్టడీ విధించారు. దాంతో పాటు ఈ కేసుని మొత్తం విచారణ చేస్తున్నారు. దీంతో ఇపుడు రౌస్ అవెన్యూ కోర్టుకు కొత్త జడ్జి రావడం పట్ల చర్చ సాగుతోంది.

మరో వైపు కవిత తన అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీం కోర్టులో కేసు వేశారు. అందులో లోపాలు ఉన్నాయని సుప్రీం కోర్టు పేర్కొనడంతో దానిని సరిదిద్దుతూ కొత్తగా పిటిషన్ దాఖలు చేసే పనిలో కవిత లాయర్లు ఉన్నారు. ఇక ఈ నెల 25వ తేదీ వరకూ కవితకు కస్టడీ విధించారు. ఆమెను సోమవారం రోజంతా ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేశారు.

అయితే ఈడీ ప్రశ్నలు కవిత నుంచి అనుకున్న స్థాయిలో జవాబులు రాలేదు అని ప్రచారం సాగింది. మరో వైపు ఆమె ద్వారా లిక్కర్ స్కాంలో వంద కోట్ల దాకా లావాదేవీలు సాగాయని అన్ని ఆధారాలు ఉండబట్టే అరెస్ట్ చేశామని ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇంకో వైపు కస్టడీలో ఉన్న కవిత తన తల్లి పిల్లలను చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుని కోరారు. ఇలా కవిత కేసు తెలంగాణాలో హాట్ హాట్ గా ఉండగా జడ్జి బదిలీ కావడం మాత్రం సంచలనం రేపుతోంది.