Begin typing your search above and press return to search.

బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే కేబినెట్ మంత్రి... సుప్రీం షాకింగ్ కామెంట్స్!

అయితే.. ఆ నలుగురిలో సెంథిల్ బాలాజీ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

By:  Tupaki Desk   |   2 Dec 2024 4:27 PM GMT
బెయిల్  పై విడుదలైన మరుసటి రోజే కేబినెట్  మంత్రి... సుప్రీం షాకింగ్  కామెంట్స్!
X

మనీలాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఏడాది సెప్టెంబర్ లో బెయిల్ మంజూరైంది. ఆయన బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్ అవ్వగా.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

అయితే.. ఆ నలుగురిలో సెంథిల్ బాలాజీ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఈ విషయం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. మరోపక్క.. బాలాజీకి బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం షాకింగ్ కామెంట్స్ చేసింది!

అవును... బెయిల్ పై విడుదలైన సెంథిల్ బాలాజీ కొన్ని గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యత చేపట్టడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు అక్కడ ఏమి జరుగుతోందంటూ ప్రశ్నించింది.

సెంథిల్ బాలాజీ బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయడంతో.. ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం... బెయిల్ పై విడుదలైన కొన్ని గంటల్లోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని ప్రస్థావించింది.

ప్రస్తుతం సెంథిల్ కేబినెట్ లో మంత్రి కాబట్టి.. సాక్షులు కచ్చితంగా ప్రభావితం అవుతారనే సందేహాలు వస్తాయని చెబుతూ.. అసలు అక్కడ ఏం జరుగుతోందంటు ప్రశ్నించింది. అయితే... బెయిల్ రద్దు చేయడం గురించి విచారణ జరిపేది లేదు కానీ.. సాక్షులు ప్రభావితం అవుతారనే అంశాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుంటామని సుప్రీం స్పష్టం చేసింది.