వేశ్యలను ఇంటికి పిలిపించుకుని... కిచెన్ లో 10 మంది బాడీ పార్ట్స్!
అవును... తాజాగా ఒక సీరియల్ సైకో కిల్లర్ కి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 8 Sep 2023 1:30 PM GMTసైకో క్రిమినల్స్ కి సంబంధించి ఎన్నో సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాల్లో సైకోలా మరిపోయిన విలన్... అమ్మాయిలను, మహిళలను బంధించి, దారుణంగా హింసించి అనంతరం కిరాతకంగా చంపుతుంటాడు. ఈ స్టోరీ బ్యాక్ గ్రౌండ్ తో చాలా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పబోయేది రియల్ స్టోరీ అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది!
అవును... తాజాగా ఒక సీరియల్ సైకో కిల్లర్ కి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 34ఏళ్ల ఈ సీరియల్ కిల్లర్ ఇప్పటివరకూ ఎంతమంది హతమార్చాడో ఇంకా లెక్కలు తేలలేదు కానీ... ప్రస్తుతానికి సుమారు 10 మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు మాత్రం అతని వంటగదిలో కనుగోబడ్డాయి!
వివరాళ్లోకి వెళ్తే... రువాండా రాజధాని కిగాలీలో ఒక అనుమానిత సీరియల్ కిల్లర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు! అతడి పేరు డెవిస్ కజుంగు కాగా.. వయసు 34ఏళ్లు. ఇతనికి వివాహం అయ్యింది. అయితే ఇతను రెండు ఇళ్లు అద్దెకు తీసుకుని ఒక దానిలో ఫ్యామిలీని ఉంచాడు. మరొకదాన్ని ఇతను వ్యక్తిగతంగా వాడుకుంటున్నాడు.
ఈ సమయంలో ఒక మర్డర్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో ఇతడిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇతని రెండో ఇంటి కిచెన్ లో తవ్విన గోతిలో సుమారు 10 మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు కనుగొన్నారు. ఇక్కడ పాతిపెట్టని మృతదేహాలు కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
రువాండా పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం... ఇతడు తన కోసం తీసుకున్న ప్రత్యేక ఇంటికి వేశ్యలను పిలిపించుకుంటాడు. ఆ సమయంలో వారినుంచి ఫోన్లు, ఇతర వస్తువులు దోచుకుంటాడు. అనంతరం వారిని దారుణంగా హత్యచేస్తాడు. ఆ మృతదేహాలను ఎవరికీ తెలియకుండా.. కిచెన్ లో గొయ్యి తీసి పాతిపెడతాడు.
ఈ కార్యక్రమాన్ని నిత్యకృత్యంగా మలుచుకున్న ఈ కిల్లర్.. వరుసగా నేరాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఒక హత్య కేసుకు సంబంధించి అనుమానంతో అరెస్ట్ చేయగా... ఈ సీరియల్ కిల్లర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటివరకూ 10 మృతదేహాలు వెలికితీయగా.. వీటిలో కొన్నింటిని యాసిడ్ వేసి కరిగించినట్లు పోలీసులు చెబుతున్నారు!
ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. సినిమాల్లోనే ఇలాంటి వారు ఉంటారని భావిస్తున్న పలువురు.. ఈ విషయం తెలుసుకుని షాకవుతున్నారు!