Begin typing your search above and press return to search.

అపర కోటీశ్వరుడు రూ.31 ఓఆర్ఎస్ డ్రింక్ తాగటమా?

ఆయన సాదాసీదా వ్యక్తి కాదు.లక్షల కోట్లకు అధిపతి. ఆ మాటకు వస్తే దేశంలోనే అత్యంత భాగ్యవంతుడు

By:  Tupaki Desk   |   12 Jun 2024 4:14 AM GMT
అపర కోటీశ్వరుడు రూ.31 ఓఆర్ఎస్ డ్రింక్ తాగటమా?
X

ఆయన సాదాసీదా వ్యక్తి కాదు.లక్షల కోట్లకు అధిపతి. ఆ మాటకు వస్తే దేశంలోనే అత్యంత భాగ్యవంతుడు. ఆ మాటకు వస్తే ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. ఈ ప్రపంచంలో టాప్ 20 సంపన్నుల జాబితా తీస్తే అందులో ఆయన పేరు ఉంటుంది. ఆయన పేరును ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. తన ఇంట్లో జరిగే వేడుకల కోసం వందల కోట్లను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసే ఆయన.. అత్యంత ఖరీదైన వస్తువుల్ని సర్వ్ చేస్తుంటారు.

అంతటి సంపన్నుడి లైఫ్ స్టైయిల్ ఎలా ఉంటుంది? ఆయన ఎలాంటి నీళ్లు తాగుతారు? ఎలాంటి డ్రింక్ తీసుకుంటారు. లాంటి సందేహాలు సాధారణంగా వస్తుంటాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంటి వారు ప్రత్యేకమైన మంచినీళ్లను తాగుతారని.. ఆ మాటకు వస్తే ప్రముఖులు.. సంపన్నులు సైతం తగు జాగ్రత్తలతో మంచినీళ్లు.. వారు తాగే పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని చెబుతారు.

వారి సంగతే ఇలా ఉంటే.. ముకేశ్ అంబానీ లాంటోల్లు మరెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో కదా? కానీ.. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరోసారి ప్రమాణస్వీకారం చేయటం తెలిసిందే. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కావటం తెలిసిందే. ముకేశ్ అంబానీ.. షారుక్ ఖాన్ పక్కపక్కనే కూర్చోవటం తెలిసిందే. అయితే.. కార్యక్రమంలో భాగంగా హాజరైన అతిధులకు ఢిల్లీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఓఆర్ ఎస్ పాకెట్లను అందజేశారు.

అందులో భాగంగా ముకేశ్ అంబానీ.. షారుక్ ఖాన్ లకు సైతం ఓఆర్ఎస్ పాకెట్లను ఇచ్చారు. వీరిద్దరు దీన్ని తాగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.వీరు తాగిన ఓఆర్ఎస్ పాకెట్ రూ.31 గా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాన్యుల మాదిరే ముకేశ్ అంబానీ - షారుక్ లు ఇద్దరు ఓఆర్ఎస్ లు తాగటాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అంత పెద్ద సంపన్నులు ఇంత సింఫుల్ గా జీవించటం ఏమిటి? అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఎంత సంపాదించినా సింఫుల్ గా వ్యవహరించటం అటు ముకేశ్ అంబానీ విషయంలోనూ.. ఇటు షారుక్ లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని తాజాగా మరోసారి రుజువైందని చెప్పాలి.