Begin typing your search above and press return to search.

శంషాబాద్ లో ఆకాశపు తిమింగలం... పిక్స్ వైరల్!

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌ క్రాఫ్ట్‌ లలో ఒకటైన ఎయిర్‌ బస్ బెలూగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది

By:  Tupaki Desk   |   2 Aug 2023 9:42 AM GMT
శంషాబాద్ లో ఆకాశపు తిమింగలం... పిక్స్ వైరల్!
X

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌ క్రాఫ్ట్‌ లలో ఒకటైన ఎయిర్‌ బస్ బెలూగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ సందర్భంగా దీన్ని చూసేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఎయిర్‌ బస్ బెలూగా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగడం ఇది రెండోసారి.

అవును... ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలూగా.. హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ సందర్భంగా... హైదరాబాద్ విమానాశ్రయం మరోసారి ఆకాశపు తిమింగలానికి ఆతిథ్యమిస్తోందని ఎయిర్‌ పోర్ట్ ఆపరేటర్ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్ లిమిటెడ్ తెలిపింది.

అయితే అత్యంత భారీగా ఉండే ఈ ఎయిర్‌ బస్ బెలూగా కార్గోను రవాణా చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఈ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి 47 టన్నుల బరువు మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ బెలూగా.

184 అడుగుల పొడవు, 56 అడుగుల ఎత్తు, ఒక్కో రెక్క వైశాల్యం 2800 చదరపు అడుగులు కలిగిన ఈ విమానం మొత్తం బరువు 86 టన్నులపైగానే ఉండటం గమనార్హం. అయితే బెలూగా కార్గో విమానం 2022 డిసెంబర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో తొలిసారిగా ల్యాండ్ అయింది.

కాగా... 1996లో మొదటిసారిగా ఎయిర్ బస్... ఈ అతిపెద్ద ఈ కార్గో విమానాన్ని తయారుచేసింది. అనంతర కాలంలో అనేక మార్పులు చేస్తూ సామర్థ్యం పెంచుకుంటూ వస్తోంది.