రతన్ టాటా ఫ్రెండ్ శంతను నాయుడు ఇప్పుడేం చేస్తున్నారంటే?
శంతను నాయుడు అన్నంతనే గుర్తించకపోవచ్చు. కొందరు గుర్తు పట్టొచ్చు. కానీ.. ఎక్కువ మందికి మాత్రం జ్ఞాపకం రాకపోవచ్చు.
By: Tupaki Desk | 6 Dec 2024 7:30 AM GMTశంతను నాయుడు అన్నంతనే గుర్తించకపోవచ్చు. కొందరు గుర్తు పట్టొచ్చు. కానీ.. ఎక్కువ మందికి మాత్రం జ్ఞాపకం రాకపోవచ్చు. కానీ.. స్వర్గీయ రతన్ టాటా కుర్ర స్నేహితుడు శంతను నాయుడు అన్నంతనే.. ఇట్టే గుర్తుకు వచ్చేస్తాడు. రతన్ టాటాకు అత్యంత సన్నిహితంగా ఉండటంతో పాటు.. ఆయన వెంటే ఉన్న శంతను ఇప్పుడేం చేస్తున్నారు? ఆయన తాజా ప్రాజెక్టు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
పుస్తకం చదవటం అన్న కాన్సెప్టు పోయి చాలా కాలమే అయ్యింది. ఎప్పుడైతే ఇంటర్నెట్.. మొబైల్ ఫోన్లు వచ్చేశాయో.. చదవటం అంతా స్క్రీన్ మీదనే అవుతుంది. పుస్తకాన్ని పట్టుకొని చదవటం అన్నది చాలా తక్కువైంది. ఇలాంటి వేళ.. శంతన నాయుడు తన కొత్త ప్రాజెక్టును ప్రారంభించాడు. అదే.. రీడింగ్ కమ్యూనిటీ బుకీలు. ఈ ప్రాజెక్టులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నిశ్శబ్దంగా చదవటానికి ఒకచోటకు చేరటమే.
దీన్ని తొలుత దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రారంభించారు. తర్వాత పుణే.. బెంగళూరుకు విస్తరించారు. ఇప్పుడు జైపూర్ లో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఒక చిట్టి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒక వైరల్ గా మారింది. డిసెంబరు 8న జైపూర్ బుకీలను ప్రారంభిస్తున్నట్లుగా శంతన నాయుడు ప్రకటించారు.
ఆదివారం జరిగే ఈ ఈవెంట్ లో చేరాలంటూ ఆయన ఆహ్వానిస్తున్నారు. జైపూర్ లో స్టార్ట్ చేసిన తర్వాత ఢిల్లీ.. కోల్ కతా.. అహ్మాదాబాద్.. సూరత్ తో సహా భారతీయ నగరాల్లో దీన్ని విస్తరిస్తారని చెబుతుననారు. గత నెలలో బెంగళూరులో నిర్వహించిన రీడింగ్ సెషన్ సక్సెస్ అయ్యింది. పుస్తక పఠనాన్ని తిరిగి తీసుకురావటమే లక్ష్యంగా దీన్ని స్టార్ట్ చేశారు. మనిషికి చదువు.. చదవటం చాలా ముఖ్యమైనదని.. బుకీస్ ఈవెంట్ లో శంతను పేర్కొన్నారు. సరికొత్త ఆలోచనతో.. సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న శంతను ఆలోచనలు సక్సెస్ కావాలని కోరుకుందాం.