విజయ సాయిరెడ్డి తో ఉన్న పరిచయంపై శాంతి క్లారిటీ!
ఈ నేపథ్యంలో శాంతి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 15 July 2024 5:07 AM GMTఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో విజయసాయిరెడ్డితో ఆమెకు సంబంధం ఉందని.. తాను విదేశాల్లో ఉన్న సమయంలో శాంతి గర్భవతి అయ్యి బిడ్డను కన్నది అని.. అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణం అని అనుమానిస్తున్నట్లు ఆమె (మాజీ) భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేస్తూ ఒక లెటర్ రాసారు. ఆ లెటర్ ఎవరు లీక్ చేసారో తెలియదు కానీ మీడియా కి, సోషల్ మీడియా కి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది . ప్రస్తుతం ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై శాంతి క్లారిటీ ఇచ్చారు!
అవును... తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన (మాజీ) భార్య శాంతి గర్భవతి అయ్యి బిడ్డను కన్నదని.. అందుకు వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణం అని అనుమానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఆమె పనిచేస్తున్న దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో శాంతి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలూ లేవని ఆమె స్పష్టం చేశారు. తనకు మదన్ మోహన్ తో 2013లో వివాహం జరిగిందని తెలిపారు. ఈ సమయంలో మదన్ మోహన్ క్రీస్టియన్ కావడంతో.. హిందూవైన తనను మతం మార్చుకోమని హింసించేవాడని ఆరోపించారు.
ఈ పరిస్థితుల్లో 2016లోనే తాను పెద్దమనుషుల సమక్షంలో విడాకులు తీసుకున్నట్లు చెప్పిన శాంతి... బాండ్ పేపర్ పై ఇద్దరం విడాకులు తీసుకున్నామని, అప్పటికే తనకు ఇద్దరు కవల ఆడపిల్లలు కలగడంతో.. చెరొక బిడ్డ సంరక్షణ బాధ్యత ఇద్దరం తీసుకున్నామని తెలిపారు. విడాకులు తీసుకున్నా మదన్ మోహన్ తనను వేధించేవాడని ఆమె స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో 2020లో తనకు ఉద్యోగం వచ్చినట్లు తెలిపిన శాంతి.. ఆ తర్వాత వేరే అధికారి వేధింపుల నుంచి కాపాడిన సుభాష్ అనే లాయర్ ను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వివాదాన్ని ఎదుర్కొంటున్న బిడ్డ ఆయనకే పుట్టినట్లు ఆమె వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో కోర్టు నుంచి కూడా విడాకులు తీసుకునేందుకు మదన్ మోహన్, తను అప్లై చేసినట్లు ఆమె చెప్పారు.
అయితే ఈ లోపు తనపై కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఓ పత్రికలో తాను అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్లు కథనాలు వచ్చాయని.. అది నమ్మి, తనకు 70 కోట్లు ఇవ్వాలంటూ మదన్ మోహన్ వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు అక్రమ సంబంధం అంటగడుతూ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా సాయిరెడ్డితో తనకున్న పరిచయంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా తాను వైజాగ్ లో పనిచెస్తున్న సమయంలో సాయిరెడ్డి వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసేవారని చెబుతూ నాటి సంఘటనను వివరించారు.
ఇందులో భాగంగా... వైజాగ్ లోని దేవాదాయశాఖ పరిధిలోని ప్రేమ సమాజం సంస్థకు చెందిన 30 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్న ఓ రిసార్ట్ ఏళ్ల తరబడి కేవలం 5 లక్షలే చెల్లించేదని.. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం లీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరడానికి తాను ఎంపీ సాయిరెడ్డిని తొలిసారి కలిసినట్లు ఆమె తెలిపారు. అనంతరం ఆ ప్రేమ సమాజం సంస్థకు రూ.25 లక్షల వరకూ లీజ్ మనీ వచ్చిందని ఆమె తెలిపారు.
కేవలం ఆ పనిమీదే ఒకసారి తాను ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశానని.. అంతమాత్రాన్న తనకూ, ఎంపీకి సంబంధం అంటగట్టేస్తారా అని అమె ప్రశ్నించారు. అసలు సాయిరెడ్డి వయసు ఏమిటి.. కూతురు వయసున్న తనతో సంబంధం ఏమిటని కూడా చూడరా అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.