Begin typing your search above and press return to search.

దూసుకుపోతోన్న దివీస్... గరిష్ట స్థాయిలో షేర్ ధర... కారణాలివే!

ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో దివీస్ లేబొరేటరీస్ షేరు ధర దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   12 Oct 2024 7:30 PM GMT
దూసుకుపోతోన్న దివీస్... గరిష్ట స్థాయిలో  షేర్  ధర... కారణాలివే!
X

దేశీయ ఫార్మా కంపెనీల్లో రూ. ఒక లక్ష కోట్ల మార్కెట్ విలువను అధిగమించినవి 8 మాత్రమే ఉన్నాయి. వీటిలో సన్ ఫార్మా రూ.4.56 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రెండో స్థానంలో దివీస్ లేబొరేటరీస్ ఉంది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో దివీస్ లేబొరేటరీస్ షేరు ధర దూసుకుపోతోంది.

అవును... శుక్రవారం బీ.ఎస్.ఈ. లో దివీస్ లేబొరేటరీస్ షేరు ధర దూసుకుపోయింది. ఈ కంపెనీ ఫ్యూచర్ డెవలప్మెంట్ పై మదుపరుల్లో విశ్వాసం పెరగడమే ఇందుకు కారణం అని చెబుతున్నారు. దీంతో... బీ.ఎస్.ఈ.లో జీవనకాల గరిష్టమైన రూ.6,159కు చేరిన ఈ షేరు ధర.. చివరికి రూ.6,141 వద్ద స్థిరపడింది.

ఫలితంగా... కంపెనీ మార్కెట్ విలువ రూ.1.63 లక్షల కోట్లను మించింది. ఈ నేపథ్యంలో. తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి విలువ సాధించిన తొలి కంపెనీగా దివీస్ లేబొరేటరీస్ గుర్తింపు సంపాదించింది. ఈ విభాగంలో మనదేశంలో ఫార్మా కంపెనీలకు అమెరికా, పలు ఐరోపా కంపెనీలలో నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు లభించే అవకశాం ఉందనే అంచనాలు ఏర్పడ్డాయి.

దీంతో... మదుపర్లు దివీస్ షేరుపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక పరిశోధన - అభివృద్ధి కార్యకలాపాల్లోనూ దివీస్ లేబొరేటరీస్ వేగంగా అడుగులు వేస్తోంది. గ్లూకాగాన్ - లైక్ పెప్టైడ్ 1 (జీ.ఎల్.పీ-1), యాక్టివ్ ఫార్మా ఇన్ గ్రేడియంట్స్ (ఏఅపీఐ) విభాగంలోనూ స్థానం సంపాదించింది. వాస్తవానికి ఈ తరహా మందులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న కంపెనీలు తక్కువగా ఉంటాయి.

దీంతో... సుమారు 2030 వరకూ దివీస్ క్రమం తప్పకుండా అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఈ కంపెనీ తన మూడో ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ని కాకినాడలో నిర్మిస్తోంది. దీనిపై ఇప్పటివరకూ రూ.1,018 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇది త్వరలో అందుబాటులోకి రాబోతోంది.

ఇలా భారతదేశంలో ఈ జాబితాలో సన్ ఫార్మా, దివీస్ లేబొరేటరీస్ తర్వాత స్థానాల్లో సిప్లా, టొరెంటో ఫార్మా, మ్యాన్ కైండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్ లైఫ్, లుపిన్ లు ఉన్నాయి!