Begin typing your search above and press return to search.

జగన్ తో నో రాజీ అంటున్న చెల్లెమ్మ ?

వైసీపీ అధినేత వైఎ జగన్ ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలకు సంబంధించి రాజీ కుదిరింది అన్న వార్తలు అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   22 Oct 2024 4:21 AM GMT
జగన్ తో నో రాజీ అంటున్న చెల్లెమ్మ ?
X

వైసీపీ అధినేత వైఎ జగన్ ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలకు సంబంధించి రాజీ కుదిరింది అన్న వార్తలు అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. ఇరు వైపుల నుంచి రాయబారం నడిపి ఒక సూత్రప్రాయమైన అంగీకారాన్ని కుదిరించారు అని అంటున్నారు. దాంతో వైసీపీ అధినేత ఒకటికి రెండు మెట్లు దిగి వచ్చారని కూడా చెబుతున్నారు.

మొత్తానికి ఆస్తుల వివాదం ఒక కొలిక్కి వచ్చిందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బెంగళూరులోని జగన్ నివాసంలోనే దీని మీద డిస్కషన్లు పూర్తి అయ్యాయని కూడా చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే ఇది వైసీపీకి హ్యాపీ లాంటి న్యూస్ అని కూడా అంతా అనుకున్నారు.

అయితే ఈ రాజీ వార్తలు బయటకు వచ్చి గంటలు గడవకముందే పీసీసీ చీఫ్ హోదాలో జగన్ మీద షర్మిల పేల్చిన డైలాగులతో మొత్తం వ్యవహారం మారింది అని అంటున్నారు. కుదిరింది వ్యక్తిగతంగా ఉన్న ఆస్తులకు సంబంధించిన వివాదమే కావచ్చు కానీ రాజకీయంగా జగన్ తో విభేదించేందుకే షర్మిల నిర్ణయించుకున్నారని అంటున్నారు.

ఆమెకు ఆస్తుల విషయం ఒక ఎత్తు అయితే రాజకీయంగా తాను నష్టపోయాను అన్నది మరో ఎత్తు అని అంటున్నారు. వైసీపీ కోసం ఆమె ఎంతో చేశారు. కానీ ఒక ఎంపీ సీటుని కూడా పొందలేకపోయారు అన్న బాధ అయితే ఉంది అని అంటున్నారు. జగన్ జైలులో ఉన్నపుడు పార్టీని మొత్తంగా నిలబెట్టింది వేల కిలోమీటర్ల షర్మిల పాదయాత్ర అని ఇప్పటికీ అంతా చెబుతారు.

మరో వైపు చూస్తే 2014, 2019 ఎన్నికల్లోనూ షర్మిల చేసిన ప్రచారం కూడా వైసీపీ ఘన విజయంలో ముఖ్య పాత్ర పోషించింది అని కూడా అంటారు. మరి కారణాలు ఏమైనా కూడా ఆమెకు రాజకీయంగా అందలం అయితే దక్కలేదు. ఆమె రాజ్యసభను కోరుకున్నారు అని దానికి కూడా చాన్స్ ఇవ్వలేదని కూడా అప్పట్లో ప్రచారం సాగింది.

సో ఇపుడు షర్మిల వేరే పార్టీలో ఉన్నారు. దేశంలో కాంగ్రెస్ కి మంచి భవిష్యత్తు కనిపిస్తోంది. ఆ పార్టీ ఆమెను నమ్మి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది. ఏపీలో కాంగ్రెస్ బలపడాలీ అంటే వైసీపీ బలహీనపడాలి. అందుకే షర్మిల ఈ రోజుకీ జగన్ మీదనే తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు అని అంటున్నారు.

లేటెస్ట్ గా ఆమె చేసిన ఒక ట్వీట్ వైసీపీని వదలను అని అంటున్నట్లుగా చాలా స్పష్టంగా ఉందని అంటున్నారు. వైఎస్సార్ మానస పుత్రిక అయిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని జగన్ సొంత కుమారుడు అయి ఉండి నీరు కార్చారని షర్మిల ద్వజమెత్తారు. అంతే కాదు జగన్ బీజేపీకి దత్తపుత్రుడు అని గట్టి ఆరోపణ చేశారు.

అంటే ఏపీలో కాంగ్రెస్ వైపే దళితులు మైనారిటీలు బడుగులు పూర్తిగా ఉండాలని ఆమె ఒక వ్యూహంతోనే జగన్ కి బీజేపీకి ముడిపెడుతున్నారని అంటున్నారు. నిజానికి గతంలో బీజేపీతో జగన్ కి బంధం ఉన్నా ఇపుడు ఏమీ లేదు. వారికి వేరే నేస్తాలు దొరికారు. భవిష్యత్తులో కూడా ఆ బంధం గట్టిగానే ఉంటుందని సంకేతాలు ఉన్నాయి.

సో బీజేపీకి జగన్ అవసరం లేదు. జగన్ కి కూడా బీజేపీ తీరు నచ్చడం లేదు. ఇదీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితి. అయినా సరే జగన్ కి బీజేపీకి ముడిపెట్టడం ద్వారా వైసీపీకి ఉన్న ట్రెడిషనల్ ఓటు బ్యాంకు ని కాంగ్రెస్ వైపు తిప్పాలన్నదే షర్మిల ఆలోచన అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఇండియా కూటమి వైపు జగన్ చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. అదే కనుక జరిగితే షర్మిలకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

అందువల్ల కూడా ఆమె రాజకీయంగా సొంత సోదరుడు అయిన జగన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్స్ అనదగిన వారు మాత్రం రాజీ పడమనే వైఎస్సార్ కుటుంబానికి సూచిస్తున్నారు అని అంటున్నారు. అలాంటి పెద్దల జోక్యం వల్లనే ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చాయి. కానీ రాజకీయంగా రాజీ అన్నది కుదిరేనా అంటే వెయిట్ అండ్ సీ.