జగన్ పై షర్మిల సింగిల్ లైన్ డిమాండ్!
ఇప్పటికే జగన్ పై తీవ్రస్థాయిలో ఫైరవుతున్న షర్మిళ మరోసారి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 8 Nov 2024 11:11 AM GMTఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో పబ్లిక్ అయిన ఈ వ్యవహారం.. ఇటీవల కాలంలో మరింత ఓపెన్ గా, తీవ్రంగా సాగుతోంది. ఇప్పటికే జగన్ పై తీవ్రస్థాయిలో ఫైరవుతున్న షర్మిళ మరోసారి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ పీసీసీ చీఫ్ గా ఎన్నికైనప్పటి నుంచీ షర్మిల... వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో ఫైరవుతున్న సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారంటూ ఆమె విరుచుకుపడ్డారు! ఇక ఎన్నికల సమయంలో షర్మిల చేసిన విమర్శలు కూటమి నేతలు కూడా చేయలేదని చెప్పినా అతిశయోక్తి కాదేమో!
ఇక గత కొన్ని రోజులుగా ఆస్తులకు సంబంధించిన విషయాలపై కూడా షర్మిల తీవ్రస్థాయిలో జగన్ పై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో మీడియాలో ఫుల్ కవరేజ్ కూడా పోందారు. ఈ క్రమంలో ఇటీవల సర్దుబాటు ఛార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అయితే ఆ కార్యక్రమానికి పెద్దగా కవరేజ్ దొరకలేదనే కామెంట్లు వినిపించాయి.
అయితే.. ఇప్పుడు తాజాగా మరోసారి జగన్ అసెంబ్లీకి హాజరుకాని విషయంపై స్పందించారు. ఈ నేపథ్యంలో జగన్ పైనా, వైసీపీ ఎమ్మెల్యేలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆ సమావేశాలకు హాజరుకాని జగన్, అతని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు!
తాజాగా ఈ విషయంపై స్పందించిన షర్మిల... "జగన్ మోహన్ రెడ్డి అయినా.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అయినా అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి" అని షర్మిల డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారుతున్నాయి!
కాగా... ప్రజాసమస్యలపై అసెంబ్లీలో తాము గళం ఎత్తుతామనే భయంతోనే ప్రభుత్వం తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని.. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంటుందని చెప్పిన జగన్... ప్రస్తుతం పరిస్థితుల్లో వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.
అలాంటప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడం వల్ల ఉపయోగం ఏముటుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవ్వడం లేదని స్పష్టం చేశారు. అయితే... అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ తెలిపారు. దీంతో... అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.