'నా ఫోన్, కార్ నెబర్లలో 151 ఉంటుంది'... జగన్ పై అనిల్ కీలక వ్యాఖ్యలు!
ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ స్పందించారు. ఈ సందర్భంగా జగన్, భారతి పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 29 Oct 2024 4:23 AM GMTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో విభేదాలు గురించి మరోసారి చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక కంపెనీలోని వాటాల విషయంలో తన చెల్లి చేసిన ఓ పని గురించి.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సీ.ఎల్.టీ.)లో పిటిషన్ వేయడంతో ఈ రచ్చ పూర్తిగా పబ్లిక్ లోకి వచ్చేసింది.. పీక్స్ కి చేరిందని అంటున్న వేళ బ్రదర్ అనిల్ స్పందించారు.
అవును... వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తులకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ లోకి పూర్తిగా వచ్చేసిన సంగతి తెలిసిందే. సుమారు గత నాలుగైదు రోజులుగా ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతోంది. ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ స్పందించారు. ఈ సందర్భంగా జగన్, భారతి పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... జగన్ - షర్మిల మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల గొడవలో మీరు ఎవరి వైపు ఉన్నారనే (సంక్లిష్టమైన) ప్రశ్న ఎదురైన వెళ... తాను సత్యం వైపు ఉన్నాయని, ఆ సత్యం ఏమిటనేది త్వరలో తెలుస్తుందని అన్నారు. షర్మిలకు ఆస్తులు ఇవ్వలేదనే విషయం అందరికీ తెలిసిన సత్యమే అని బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు.
ఈడీ జప్తులో ఉన్నప్పటికీ... చెల్లికి ఇవ్వాలనుకుంటే 100 రకాలుగా ఇవ్వొచ్చంటూ బ్రదర్ అనిల్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక వైఎస్సార్ బ్రతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకాలు అయిపోయాయనే ప్రశ్నకు... తనకు తెలియదని, తాను ఎప్పుడూ ఆస్తుల విషయాల్లో జోక్యం చేసుకోలేదని.. అయినప్పటికీ అప్పుడు ఆస్తుల పంపకాలు కాలేదని అన్నారు.
ఇక, తాము తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత తమకు వ్యతిరేకంగా వాళ్లు చాలా మాట్లాడారని.. ఆ సమయంలో పార్టీలోకి వచ్చేవాళ్లను రానివ్వకుండా చాలా ఆటంకాలు పెట్టారని.. సాక్షి లో చాలా అవమానకరంగా మాట్లాడారని.. ఆ సమయంలో సాక్షి పత్రికలో ప్రకటనలు ఇవ్వడానికి కూడా తమకు స్పేస్ ఇవ్వలేదని.. డబ్బులు ఇస్తామని కూడా చెప్పామని అన్నారు!
ఇక అన్నాచెల్లెలి మధ్య విజయమ్మ నలిగిపోతున్నారని.. ఆమెకు అన్నీ తెలుసని.. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం ఎందుకని ఆమె విదేశాలకు వెళ్లిపోయారని అన్నారు. ఇక చంద్రబాబుతో కలిసి ఉండటం వల్ల ఆమెకు వచ్చే అడ్వాంటేజ్ ఏమీ లేదని అన్నారు. జగన్ కోసం షర్మిల పాదయాత్ర చేయాలన్ని భారతినే అడిగారని.. జగన్ బయటకు రావాలంటే పాదయాత్ర చేయాల్సిందే అన్న అని తానకు చెప్పారని చెప్పారు.
అనంతరం ఏపీలో జగన్ గెలిచిన తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టాలని ప్రశాంత్ కిశోర్ వచ్చి షర్మిలను అడిగారని.. ఈ విషయంపై జగన్ ను అడిగితే వద్దని చెప్పారని, అక్కడ కేసీఆర్ ఉన్నారని, తమకు ఇబ్బంది అవుతుందని చెపారని చెప్పుకొచ్చారు. సీఎం అయిన తర్వాత జగన్ మారిన విధానం తమకూ అర్ధం కావడం లేదని అన్నారు.
ఇక.. జగన్ కు 2019లో వచ్చిన 151 సీట్లపైనా ఆయన స్పందించారు. తన ఫోన్ నెంబర్ లో 151 ఉంటుందని, తన కారు నెంబర్ లో 151 ఉంటుందని.. ఇది దేవుడు తన రాజ్యాన్ని నెలకొల్పమని ఇచ్చిన గెలుపు అది అని.. అయితే పవర్ వచ్చిన తర్వాత జగన్ తమను దగ్గరకు రానియ లేదని, అప్పుడు జగన్ నిజస్వరూపం బయటపడిందని చెప్పుకొచ్చారు.