Begin typing your search above and press return to search.

ఒకే వేదికపై షర్మిళ, జగన్... వాట్ నెక్స్ట్?

ప్రధానంగా ఏపీలో పీసీసీ చీఫ్ గా షర్మిళ ఎన్నికైనప్పటి నుంచీ జగన్ వర్సెస్ షర్మిళ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Sep 2024 3:30 PM GMT
ఒకే వేదికపై షర్మిళ, జగన్... వాట్  నెక్స్ట్?
X

ప్రధానంగా ఏపీలో పీసీసీ చీఫ్ గా షర్మిళ ఎన్నికైనప్పటి నుంచీ జగన్ వర్సెస్ షర్మిళ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వత కూడా.. ప్రభుత్వాన్ని తమలపాకుతో ప్రతిపక్ష వైసీపీని తపులు చెక్కతో కొడుతున్నారనే కామెంట్లూ వినిపించాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే.. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఓటమి కోసమే షర్మిళ పనిచేశార్నే కామెంట్లు బలంగా వినిపించాయి. ఇక కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిళ పరాజయం పాలయ్యారు. తన బాబాయి వైఎస్ వివేకా హత్య కేసుపై అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసినా.. కడప లోక్ సభ పరిధిలో ఫలితం మాత్రం మారలేదు.

ఆ సంగతి అలా ఉంటే... ఇటీవల జరిగిన రాఖీ పండుగ సమయంలో కూడా షర్మిళ నుంచి జగన్ కు శుభాకాంక్షలు రాలేదు సరికదా.. "ఎలాంటి రక్త సంబంధం లేక్పోయినా..." అంటూ షర్మిళ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కట్ చేస్తే... తాజాగా ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరూ ఈ రోజు ఇడుపుల పాయలోనే బస చేయనున్నారు.

అవును... ప్రస్తుతం ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పులివెందులలో ఉన్నారు. బెంగళూరు నుంచి శనివారం కడపకు చేరుకున్న జగన్.. పెండిమర్రి మండలం మచనూరుకి వెళ్లారు. ఈ క్రమంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు మాచనూరి చంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం స్థానిక వైసీపీ శ్రేణులతో కొంత సమయం గడిపిన జగన్.. అనంతరం గొందిపల్లి చేరుకొని కడప మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె వివాహం ఇటీవల జరిగిన నేపథ్యంలో.. నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం జగన్ ఇడుపుల పాయకు చేరుకున్నారు.

అయితే... ఈ రోజు సాయంత్రం జగన్ ఇడుపులపాయకు చేరుకుంటారు. ఇదే సమయంలో షర్మిళ సైతం రాత్రికి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. సోమవారం వైఎస్సార్ వర్ధంతి కావడంతో.. అన్నాచెల్లెల్లు ఇద్దరూ దివంగత నేతకు నివాళి అర్పించనున్నారు. అయితే... ఇద్దరూ వేరు వేరుగానే నివాళులు అర్పించనున్నారు.

కాగా... జూలై 8న ముందుగా జగన్ తన తండ్రికి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం షర్మిళ.. వైఎస్సార్ ఘాట్ వద్దకు వచ్చి నివాళి అర్పించారు.. ఈ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఇద్దరితోనూ విజయమ్మ హాజారయ్యారు. అయితే.. ఈసారీ ఇదేవిధంగా జరగనుందని అంటున్నారు.

ఏది ఏమైనా... అన్నా చెల్లీ ఇద్దరూ నేడు పులివెందులలో ఉండటంతో రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అన్నా చెల్లి కలిసి ఇడుపుల పాయకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందా అని వైఎస్సార్ అభిమానులు చర్చించుకుంటున్నారు.