Begin typing your search above and press return to search.

"అప్పుడు బెయిల్ గుర్తుకు రాలేదా?".. షర్మిళ మాటల తూటాల వర్షం!

వైఎస్ జగన్ - షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Oct 2024 5:22 AM GMT
అప్పుడు బెయిల్  గుర్తుకు రాలేదా?.. షర్మిళ మాటల తూటాల వర్షం!
X

వైఎస్ జగన్ - షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో స్పందించిన జగన్... ఇది అందరి ఇళ్లల్లోనూ జరిగేదే అని.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ కొత్త డ్రామాకు తెరలేపారన్నట్లుగా మాట్లాడగా... ఈ కామెంట్ పై షర్మిళ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... “అందరి ఇళ్లలో జరిగేదే కానీ, ఎవరూ తన తల్లి, చెల్లిపై కేసులు పెట్టారు” అంటూ సూటిగా రిప్లై ఇచ్చారు! ఇదే సమయంలో... తల్లి, చెల్లితో ఇంట్లో గొడవైనా కూడా వైసీపీ అధినేత జగన్ మమ్మల్నే నిందిస్తున్నారని.. ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లి, చెల్లిని రోడ్డుపైకి లాగి మా గురించి మట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు.

ఇదే సమయంలో... అసలు దీంతో మాకేం సంబంధం అంటూ బాబు రియాక్ట్ అయ్యారు. మాజీ మంత్రి పేర్ని నాని.. ఈ వ్యవహారంపై స్పందించారు. ఇలాంటి చెల్లి ఉంటే ఏ అన్నకైనా ఇబ్బందులు తప్పవన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇలా జగన్ - షర్మిళ ఆస్తుల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ సమయంలో 'సాక్షి' ఎంటరైంది!

అవును... జగన్-షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల తగాదాలు, కోర్టు పిటిషన్లు, లేఖలు, మీడియాలో కామెంట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సమయంలో 'సాక్షి' స్పందించింది. ఈ సందర్భంగా.. షర్మిలపై పలు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే సమయంలో... అసలు షర్మిలపై జగన్ కు ఉన్నది మొత్తం ప్రేమే అని విశ్లేషించింది!

ఈ సందర్భంగా... “రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి మరీ సొంత సోదరుడిపై కుట్రలకు దిగుతున్న చెల్లి వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఆస్తుల బదలాయింపు వల్ల తన సోదరుడు న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా గిఫ్ట్ డీడ్ ను షేర్లుగా మార్చుకుని దుర్వినియోగం చేశారంటే ఏమనాలి? దీనిపై జగన్ కు సమాచారం ఇవ్వకపోవడంలో అర్ధం ఏమిటి?”

ఈ ప్రశ్నలకు షర్మిళ నుంచి తిరిగి ప్రశ్నల రూపంలో ఘాటు సమాధానాలు వచ్చాయి! ఇందులో భాగంగా... "ఈడీ 2016లో ఎటాచ్ చేసిన సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని చెబుతున్న జగన్... 2019లో 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూపై సంతకం ఎలా చేశారు? అప్పుడు బెయిల్ గుర్తుకురాలేదా?"

"క్లాసిక్, సండూరులో ఉన్న కంపెనీ షేర్లను రూ.42 కోట్లకు కొనుగోలు చేసేందుకు 2021లో తల్లి విజయమ్మకు అనుమతి ఇచ్చినప్పుడు బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?.. అదే ఏడాది జగన్, ఆయన భార్య షేర్లపై సంతకం చేసి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పుడు కూడా బెయిల్ సంగతి గుర్తుకురాలేదా?” అని సూటిగా ప్రశ్నించారు!