Begin typing your search above and press return to search.

కడప మీదనే షర్మిల ఫోకస్... జగన్ కి బిగ్ ట్రబుల్ !

ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత షర్మిల తన టార్గెట్ మొత్తం వైసీపీ మీదనే పెట్టేశారు.

By:  Tupaki Desk   |   9 Sep 2024 2:30 PM GMT
కడప మీదనే షర్మిల ఫోకస్... జగన్ కి బిగ్ ట్రబుల్ !
X

ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత షర్మిల తన టార్గెట్ మొత్తం వైసీపీ మీదనే పెట్టేశారు. ఏపీలో వైసీపీ లేకుండా పోతేనే కాంగ్రెస్ బలపడుతుంది అన్నది ఆమె ఆలోచనగా ఉంది. అదే సమయంలో సొంత అన్న జగన్ తో ఉన్న వ్యక్తిగత విభేదాలు కూడా ఆమెను వైసీపీ మీద మరింత టార్గెట్ చేసేందుకు పురి గొలుపుతున్నాయి.

హై కమాండ్ కూడా ఇదే బాగుందనుకుని షర్మిలకే పగ్గాలు అపప్గించి పూర్తి స్వేచ్ఛ కూడా ఇస్తోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి అడ్డా లాంటి కడప గడ్డ మీదనే షర్మిల ఫోకస్ పెట్టేశారు అని అంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని వైఎస్సార్ జిల్లాలో చావు దెబ్బ తీసింది కాంగ్రెస్. దాని వెనక షర్మిల వ్యూహాలు ఉన్నాయి.

ఏకంగా కడప ఎమ్మెల్యే సీటుని వైసీపీ కోలోపోయింది. అదే సమయంలో కడప సిటీలో కాంగ్రెస్ కి 13 శాతం ఓట్లు వచ్చాయి. అంటే 24 వేల 500 ఓట్లుగా చెబుతున్నారు. అదే వైసీపీకి 35 శాతం ఓట్లు వచ్చాయి. కడపలో దశాబ్దాలుగా గెలవని టీడీపీ గెలవడం వెనక కాంగ్రెస్ వైసీపీని చీల్చిన భారీ ఓటు షే ఉందని అంటున్నారు.

ఇక ఆ ఎన్నికల్లో కడప నుంచి వైసీపీ తరఫున మాజీ మంత్రి అంజాద్ భాషా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి అఫ్జల్ ఖాన్ పోటీ చేశారు. ఈ ఇద్దరూ ముస్లిం అభ్యర్ధులు. దాంతో హిందువు అయిన టీడీపీ అభ్యర్థి మాధవీ రెడ్డి మంచి మెజారిటీతో గెలిచారు. ఇక వైసీపీ బీజేపీ తెర వెనక పొత్తు అంటూ షర్మిల చేసిన ప్రచారం కూడా వైసీపీ ఓటమికి కారణం అయింది.

ముస్లిములు సైతం దీనిని బలంగా నమ్మడంతోనే ముస్లిం మైనారిటీ ఓట్లు వైసీపీ నుంచి కాంగ్రెస్ కి పెద్ద ఎత్తున మళ్లాయని ఆ ఎన్నికల తరువాత జరిగిన విశ్లేషణ నిరూపించింది. ఇక వైసీపీ అభ్యర్ధి అంజాద్ భాషా పట్ల కూడా ముస్లిం మైనారిటీ సమాజంలో వ్యతిరేకత ఉండడం ఆయన తమ్ముడి వ్యవహార శైలి కూడా వైసీపీని దెబ్బ తీసింది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో కడప అసెంబ్లీ సీటుకు వైసీపీ ఇంచార్జిగా అంజాద్ భాషానే వైసీపీ ఇంకా కొనసాగించడం వల్ల కూడా వైసీపీ మరింత వ్యతిరేకత మూటకట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ గ్రహించిన మీదటనే కడప గడపలో వైసీపీని లేకుండా చేయాలన్న భారీ వ్యూహంతోనే షర్మిల కడప నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అఫ్జల్ ఖాన్ కి ఇచ్చారు అని అంటున్నారు.

అంజాద్ భాషా మీద ఇటు ముస్లింలలో అటు సాధారణ ప్రజలలో వ్యతిరేకత ఉంది అని తెలిసినా అయానకే పార్టీ పగ్గాలు వైసీపీ అప్పగించడమే షర్మిల వ్యూహానికి కలసి వచ్చే అంశం అవుతుంది అని అంటున్నారు. అక్కడ అంజాద్ భాషా ఉన్నత కాలం కాంగ్రెస్ దూసుకుని వెళ్తుంది అని అంటున్నారు. ఒక స్థాయిలో కాంగ్రెస్ పట్టు సాధించాక ఇక వైసీపీ ఎన్ని మార్పుచేర్పులు చేసుకున్నా ఫలితం ఉండదని కూడా అంటున్నారు.

మరి ఈ విషయంలో వైసీపీ ఏ రకమైన చర్యలకు దిగుతుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ముందు కడపలోనే వైసీపీ నడ్డి విరగ్గొడితే ఏపీలో మరింతగా దూసుకుని పోవచ్చు అన్నదే షర్మిల ప్లాన్ గా కనిపిస్తోంది.ఏది ఏమైనా షర్మిల వైసీపీని టార్గెట్ చేశారు. దానిని చాలా ఈజీగా వైసీపీ చూస్తూ ఊరుకుంటే రానున్న రోజులలో సొంత ఇలాకాలోనే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి షర్మిల స్టెప్ కి కొత్త ఎత్తుగడను వైసీపీ ఏమి వేస్తుందో అన్నది.