టీడీపీ బ్లాస్ట్...జగన్ పై నెవర్ బిఫోర్ ఎటాక్!
అంతే అందులో బ్లాస్టింగ్ న్యూస్ దూసుకుని వచ్చింది.
By: Tupaki Desk | 24 Oct 2024 2:31 AM GMTఏదో సెన్సేషనల్ న్యూస్ ని బ్లాస్ట్ చేస్తున్నామని బుధవారం రోజంతా ఊరించిన టీడీపీ ఎట్టకేలకు రాత్రి పొద్దుపోయాక తన ట్విట్టర్ కి పని చెప్పింది. అంతే అందులో బ్లాస్టింగ్ న్యూస్ దూసుకుని వచ్చింది. జగన్ మీద నెవెర్ బిఫోర్ అన్నట్లుగానే అది ఫైర్ అయింది.
ఏకంగా జగన్ సోదరి తన సొంత అన్న తనను ఎలా మోసం చేశారో వివరిస్తూ సెప్టెంబర్ 12న ఆయనకే రాసిన లేఖను టీడీపీ సంపాదించింది. ఆ లేఖను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ చేసింది. అందులో షర్మిల డియర్ జగనన్నా అంటూ సంభోదిస్తూనే ఆయన మీద వరసగా ఎక్కుపెట్టిన అనేక బాణాల్లాంటి ప్రశ్నలు ఉన్నాయి.
వాటిని ఒక్కోదానిని ట్వీట్ చేస్తూ సైకో జగన్ తల్లిని చెల్లెలుని ఎలా మోసం చేశారో అని టీడీపీ విమర్శలు చేసింది. ఆయన సమాజానికే ప్రమాదకరం అంటూ కూడా తీవ్ర కామెంట్స్ చేసింది. ఇంతకీ షర్మిల జగన్ కి రాసిన ఆ లేఖ సారాంశం ఏమిటి అంటే వైఎస్సార్ తన జీవిత కాలంలో కుటుంబ వనరులుగా సంపాదించిన ఆస్తులను తన నలుగురు మనవళ్లకు సరిసమానంగా ఇవ్వాలన్నది.
ఆ విషయంలో తండ్రి బతికి ఉండగా జగన్ అంగీకరించి ఆ తరువాత మాట తప్పారు అన్నదే షర్మిల ఆ లేఖలో ఎత్తి చూపారు. వైఎస్సార్ కుటుంబ వనరులుగా సంపాదిచిన ఆస్తులలో సాక్షి మీడియా, భారతీ సిమెంట్స్ తో పాటు సరస్వతీ పవర్ ప్లాంట్ వంటివి ఉన్నాయని పేర్కొంది. అయితే జగన్ చాలా కాలంగా ఆ ఆస్తులను సరిసమానంగా పంచడానికి నిరాకరిస్తూ ఎట్టకేలకు 2019 ఆగస్టులో ఒక్క సరస్వతి పవర్ ప్లాంట్ షేర్లను మాత్రమే బదిలీ చేస్తూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని షర్మిల పేర్కొన్నారు.
అయితే సొంత అన్నయ్యతో పేచీలు ఎందుకు అని తాను పాక్షికంగా అయినా ఆస్తుల పంపిణీ జరిగినా అన్నీ ఒప్పుకున్నాను అని ఆమె అన్నారు. అయితే ఇపుడు వాటి మీద కూడా ఇచ్చిన ఒప్పందాన్ని పక్కన పెడుతూ కోర్టు దాకా వెళ్ళి వెనక్కి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఏ మాత్రం హర్షించలేనివని ఆమె ఆ లేఖలో చెప్పడం జరిగింది.
వైఎస్సార్ కుమారుడిగా తండ్రికి ఇచ్చిన మాటను జగన్ తప్పాడని ఆమె చేసిన ఆరోపణలు అలాగే చెల్లెలుకు అన్యాయం చేశారు అని అంటూ కూడా టీడీపీ షర్మిల లేఖను ఆధారంగా చేసుకుని ట్వీట్ లో ఘాటైన విమర్శలు చేసింది. జగన్ ని సైకో అంటూ తల్లీ చెల్లెలు కన్నీటి లేఖలు ఆయన మీద రాశారని అదే రివీల్ చేస్తున్నామని పేర్కొంది.
ఇవన్నీ జగన్ గురించి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశ్యంతోనే రివీల్ చేస్తున్నామని కూడా పేర్కొనడం విశేషం. మరో వైపు చూస్తే జగన్ మీద టీడీపీ ఈ విధంగా ఒక సీరియస్ ఇష్యూని బ్లాస్ట్ చేయడం ద్వారా ఆయన తల్లి చెల్లెలు మీదనే కోర్టుకు వెళ్ళారని ఇక ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు అని గట్టిగా ఎస్ట్లాబ్లిష్ చేయాలని చూస్తోంది అంటున్నారు.
సొంత అన్న కోసం చెల్లెలు ఆస్తులు వదులుకుంటే చెల్లెలు తల్లి మీద జగన్ కేసులు పెట్టారని కూడా టీడీపీ మండిపడింది. చరిత్రలో ఏ పురాణం చూసినా, ప్రపంచంలోని ఏ జీవిని చూసినా తల్లి తర్వాతేనని, జంతువులకు కూడా తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుందని, కానీ ఈ కన్నీటి లేఖను చూస్తే జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఓ వింత సైకో గురించి తెలుసుకుంటారని జగన్‌ను ఉద్దేశించి పేర్కొంది.
అదే విధంగా చూస్తే చట్టబద్దంగా కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోవడానికి తన సొంత తల్లి, చెల్లి మీద కూడా జగన్ కేసులు పెట్టాడని విమర్శలు గుప్పించింది. ఆ విధంగా జగన్ సైకో మనస్తత్వానికి ఇదొక నిదర్శనమని పేర్కొంది. జగన్ ఆస్తుల కోసం తన సొంత తల్లి, చెల్లిని కూడా కోర్టుకి లాగాడని ఆరోపించింది. మొత్తానికి ఈ ఇష్యూ ద్వారా జగన్ ని ఎంతలా బదనాం చేయాలో అంతలా చేసి మరీ టీడీపీ వదిలిపెట్టింది. మరి దీని మీద జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.