Begin typing your search above and press return to search.

షర్మిలమ్మ సందడి లేదేంటమ్మా ?

ఆమె ట్వీట్లు చేస్తూ హడావుడి చేస్తూంటారు. ఆమె పర్యటనలు లేని నాడు కూడా అలా సోషల్ మీడియాలో తన హవా చాటుకుంటూ ఉంటారు.

By:  Tupaki Desk   |   3 Jan 2025 3:43 AM GMT
షర్మిలమ్మ సందడి లేదేంటమ్మా ?
X

కొత్త ఏడాది వచ్చింది చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ న్యూ ఇయర్ వేళ ప్రజలకు సందేశం ఇచ్చారు కొత్త ఏడాది అనుభూతులను జనం ముఖంగా పంచుకున్నారు. అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. వచ్చే ప్రతీ రోజూ గొప్పగా ఉండాలని కోరుకున్నారు.

ఇక రాజకీయ పార్టీలు నాయకులు అంతా ఈ విధంగా గ్రీట్ చేస్తూ కొత్త ఏడాదిలో అడుగు పెట్టిన వేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సందడి మాత్రం లేకుండా పోయింది అని అంటున్నారు. ఆమె న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారా లేదా అన్నది కూడా సందేహంగా ఉంది.

ఆమె ట్వీట్లు చేస్తూ హడావుడి చేస్తూంటారు. ఆమె పర్యటనలు లేని నాడు కూడా అలా సోషల్ మీడియాలో తన హవా చాటుకుంటూ ఉంటారు. అటువంటిది ఆమె కొద్ది రోజులుగా అలికిడి లేకుండా ఉన్నారని అంటున్నారు. వాట్ హాపెండ్ అన్నది కూడా ఒక చర్చగా ఉంది.

అసలు ఏమి జరిగింది అన్నది కూడా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఆమెకు దూరంగా ఉన్నారని వార్తలు ఒక వైపు ఉంటే ఆమెను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పిస్తారు అని మరో వైపు పుకార్లు షికారుగా వ్యాపిస్తూ వచ్చాయి.

ఇంకో వైపు వైసీపీ కాంగ్రెస్ తో దోస్తీ కడుతుందని ఏపీ కాంగ్రెస్ కి కొత్త చీఫ్ వైసీపీ కోరుకున్న వారే వస్తారని కూడా ప్రచారాలు అదో మాదిరిగా జరిగిపోయాయి. ఇక క్రిస్మస్ రోజున వైఎస్ జగన్ వైఎస్ విజయమ్మ ఎంతో అనుబంధంతో అప్యాయతతో ఉన్న ఫోటోలు అంతా చూశారు. యావత్తు వైఎస్ ఫ్యామిలీ అంతా జగన్ వెంట ర్యాలీ అయి గ్రూప్ ఫోటోలతో హల్ చల్ చేసిన సందర్భాన్ని చూశారు.

ఇవన్నీ చూసిన మీదట వైఎస్ షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా సాగింది. అయితే కొత్త ఏడాదికి కొద్ది రోజుల ముందు నుంచే షర్మిల ట్విట్టర్ హ్యాండిల్ పెద్దగా సౌండ్ చేయడం లేదు అని అంటున్నారు. ఆమె ఇటీవల కాలంలో పెట్టిన ట్వీట్ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఉంది. కర్నాటకో స్టీల్ ప్లాంట్ ని ఆదుకున్న కేంద్రం ఏపీలో ఎందుకు విశాఖను ప్రైవేట్ పరం చేస్తోంది అని ఆమె ప్రశ్నిస్తూ కూటమి నేతలకు ప్రభుత్వానికి ప్రశ్నలను సంధించారు.

ఆ తరువాత అయితే పెద్దగా ట్వీట్లు లేవు అని అంటున్నారు మరి కొత్త ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రణాళికను షర్మిల ఎపుడు చెబుతారు ఏమిటి అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా షర్మిల వ్యూహత్మకమైన మౌనం పాటించారా లేక కావాలనే అలా ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఆమె మళ్లీ యాక్టివ్ అవుతారని అవాలని కోరుకున్న వారూ ఎంతో మంది ఉన్నారు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద గొంతు చేసుకుని మాట్లాడే షర్మిల 2025లో ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తో వస్తారో అని అంతా వేచి చూస్తున్నారు.