Begin typing your search above and press return to search.

తిరుమల లడ్డూ వివాదం.. షర్మిల అలా అనేశారేంటి?

వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూలో జంతువుల కొవ్వులు, పంది కొవ్వు వినియోగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Sep 2024 9:21 AM GMT
తిరుమల లడ్డూ వివాదం.. షర్మిల అలా అనేశారేంటి?
X

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో తిరుమల లడ్డూ వివాదం కాకరేపుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూలో జంతువుల కొవ్వులు, పంది కొవ్వు వినియోగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గుజరాత్‌ లోని ప్రభుత్వ లేబొరేటరీ నివేదిక ఇచ్చిందని చెబుతున్నారు.

మరోవైపు వైసీపీ నేతలు దేవుడిని రాజకీయాల్లోకి లాగితే మట్టికొట్టుకుపోతారని టీడీపీ నేతలను తిట్టిపోస్తున్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిలతో విచారణ చేయించుకోవచ్చని సవాల్‌ విసురుతున్నారు. లేదా తిరుమలలో స్వామి వారి ముందు ప్రమాణం చేస్తామని గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో వైసీపీ ఏకంగా ౖహె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అత్యవసర విచారణ జరపాలని కోరింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా లడ్డూ వివాదంపై స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తామన్నారు. లడ్డూలో నెయ్యి కల్తీపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ ను కూడా కలిసి లడ్డూ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని షర్మిల హెచ్చరించారు.

దేశ విదేశాల తిరుమలకు భక్తులు వస్తారని, లడ్డూలో చేప నూనె, జంతువుల నూనెల వాడారంటూ చంద్రబాబు చెప్పారని.. ఇంత పెద్ద విషయాన్ని ఆయన ఇంత సులువుగా ఎలా చెబుతారని నిలదీశారు. లడ్డూలో జంతువుల నూనెలు కలిశాయంటూ చంద్రబాబు చావుకబురు చల్లగా చెప్పారని మండిపడ్డారు. జంతువుల నూనెతో తిరుమల లడ్డూలు చేస్తున్నారని చెప్పడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడ్డాయన్నారు.

లడ్డూలో జంతువుల నూనెల కలుస్తున్నాయని చంద్రబాబుకు ముందే తెలిస్తే ఇప్పుడు వరకు ఎందుకు చెప్పలేదని షర్మిల నిలదీశారు. 100 రోజుల సెలబ్రేషన్స్‌ లో చెప్పాలని ఆగారా అని మండిపడ్డారు. ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్పారని.. అసలు చంద్రబాబు ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. వైసీపీపై విషం చిమ్మే ఉద్దేశంతోనే చంద్రబాబు లడ్డూలో జంతువుల నూనెలు కలుస్తున్నాయని చెప్పారా అని నిలదీశారు.

లడ్డూ విషయంలో కేంద్రానికి లేఖ రాశానని.. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ జరగాలన్నారు. దోషులెవరో బయటకు రావాలన్నారు. చంద్రబాబు చంద్రబాబు తన 100 రోజుల పాలనలో వైఎస్సార్‌ విగ్రహాలు ధ్వంసం చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలను ఇప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అలాగే 100 రోజుల మోడీ పాలన కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని విమర్శించారు. కనీసం కూటమి ప్రభుత్వమైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు.

వైసీపీ విశ్వసనీయతను కోల్పోయిందని షర్మిల ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ మంచి పేరు తెచ్చుకుంటే జగన్‌ చెడ్డపేరు తెచ్చుకున్నారన్నారు. రుషికొండపై కబ్జాలు చేయడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్‌ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ౖÐð ఎస్సార్‌ కు, జగన్‌ కు ఎక్కడా పొంతనే లేదన్నారు. వైసీపీలో జగన్‌ తప్ప ఎవరూ మిగలరని షర్మిల జోస్యం చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి సైతం వైసీపీలో ఉండరని తెలిపారు. ఈ నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.