Begin typing your search above and press return to search.

''బైబిల్ పై ప్రమాణం చేస్తా''... వైఎస్సార్ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ!

ఈ సమయంలో సాక్షి మీడియా ద్వారా బుధవారం పలు కథనాలు ప్రసారమయ్యాయి.

By:  Tupaki Desk   |   25 Oct 2024 10:09 AM GMT
బైబిల్  పై ప్రమాణం చేస్తా... వైఎస్సార్  అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ!
X

ఏపీలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. షర్మిల, విజయమ్మలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ను అశ్రయించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సాక్షి మీడియా ద్వారా బుధవారం పలు కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై తాజాగా షర్మిల స్పందించారు.


అవును... ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా... వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాసినట్లు తెలిపారు!


ఈ సందర్భంగా... “ఈ రోజు పొద్దున్న సాక్షి పేపర్ చూశాను.. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టి ఏదైనా నమ్మించగలడు” అని మొదలుపెట్టిన షర్మిల.. “అయినప్పటికీ వైఎస్సార్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాదని” అన్నారు.


"నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం"!:

ఈ సందర్భంగా... నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి అమ్మ వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకంలో... "రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తు అయితే.. తన బిడ్డ షర్మిల మరొకెత్తు" అని రాశారని.. నాన్నకు నేనంటే అంత ప్రేమ అని షర్మిల అన్నారు. ఆయన బ్రతికున్నంత కాలం... "నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం" అని అనేవారని తెలిపారు.

ఇదే సమయంలో... రాజశేఖర్ రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే అని, అవి జగన్ మోహన్ రెడ్డి సొంతం కాదని, ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ "గార్డియన్" మాత్రమే అని, అన్ని వ్యాపారాలనూ నలుగురు పిల్లలకు సమానంగా పంచిపెట్టడం జగన్ బాధ్యత అని షర్మిల తెలిపారు.

ఈ విషయంలో వైఎస్సార్ ఉద్దేశ్యం ఆన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికీ స్పష్టంగా తెలిసిన విషయమని.. అందులో కేవీపీ రామచంద్రరావు, వైవీ సుబ్బరెడ్డి, విజయసాయిరెడ్డి కూడా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఇది వైఎస్సార్ మేండేట్ అని ఆమె స్పష్టం చేశారు.

ఒక్క సండూరు మినహాయించి.. సరస్వతి, భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ వ్యాపారాలన్నీ వైఎస్సార్ బ్రతికి ఉండగా స్థాపించినవి అని.. అందులో నలుగురు బిడ్డలకూ సమాన వాటా ఉండాలనేది వైఎస్సార్ మేండేట్ అని ఆమె పునరుద్ఘాటించారు.

"సండూరు మినహా అన్నీ ఫ్యామిలీ ఆస్తులే"!:

ఒక్క సండూరు మినహాయించి.. మిగిలిన అన్ని వ్యాపారాలూ కుటుంబ వ్యాపరాలే అని.. వైఎస్సార్ బ్రతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవమని.. నేను జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదమని.. నాకంటూ వ్యక్తిగతంగా ఆస్తులపై మోజు లేదని.. వీళ్లు పెట్టిన హింసలకు ఆ ఆస్తులు కావాలనే కోరిక కూడా లేదని షర్మిళ తెలిపారు.

కాకపోతే... నా బిడ్డలకు ఆస్తులు చెందాలనేది వైఎస్సార్ అభిమతం గనుక ఈ రోజు వరకూ అమ్మ అయినా, తానైనా తపనపడుతున్నామని.. ఈ విషయంపై అమ్మ ఇప్పటికే వెయ్యి సార్లు అడిగి ఉంటుందని.. అయినా కూడా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తులు ఒక్కటి కూడా ఇవ్వలేదని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు!

"బిడ్డలను పక్కన పెట్టి పార్టీని భుజాలపై మోసాను"!:

ఇదే క్రమంలో... వైఎస్సార్ మరణించిన తర్వాత సుమారు 10 ఏళ్లు జగన్ ఇబ్బందులు పడితే అవి నా ఇబ్బందులు అనుకుని శక్తికి మించి సహాయం చేశానని... ఆ సమయంలో నా తోడబుట్టినవాడి కోసం బిడ్డలను సైతం పక్కన పెట్టి ఆయన పార్టీని ఏ స్వార్ధం లేకుండా నా భుజాల మీద మోశానని షర్మిల తెలిపారు.

ఇక ఆ పదేళ్లలో నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ కంపెనీలోని డివిడెండ్ లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ రు.200 కోట్ల మేటర్ అని షర్మిల తెలిపారు. ఈ విషయంలో వాళ్లు చేసింది ఉపకారం కాదు, ప్రేమతో ఇచ్చింది అంతకంటే కాదు, నాకు సమనా వాటా ఉంది కాబటి డివిడెండ్ లో సగం వాటా ఇచ్చారు.. అది కూడా అప్పుగా చూపించమన్నారు అని షర్మిల పేర్కొన్నారు!

జగన్ సీఎం అయ్యాక గుర్తుపట్టలేనంతగా మారిపోయారు!:

2019లో జగన్ సీఎం అయిన తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయారని.. సీఎం ఎయిన నెలరోజులకే విడిపోదామని ఇజ్రాయెల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారని.. దీనికి అమ్మా, నేనూ వద్దని చెబితే.. ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టారని తెలిపారు. తర్వాత విజయవాడలో.. సాక్షిలో తనకు ఎక్కువ వాటా కావాలని అడిగారని తెలిపారు.

ఈ సమయంలో అర్ధగంటలో ఆస్తుల వాటా అయిపోయిందని.. ఇందులో భాగంగా... సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్ లో వాళ్లకు చెందిన 49 శాతంలో 40 శాతం, సరస్వతి పవర్ లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్సార్ నివాసమున్న ఇల్లు, మరికొన్ని ఆస్తులు నా భాగానికి వచ్చినట్లు షర్మిల తెలిపారు.

ఈ క్రమంలోనే 2019లో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి ఎంవోయూ తయారయ్యిందని.. అయితే... కేసుల్లో లేని సరస్వతి, యలహంక ప్రాపర్టీలను ఎంవోయూ ఎంవోయూపై సంతకం పెట్టిన 2019లోనే ఇవ్వాల్సి ఉండగా ఈ రోజు వరకూ నాకు ఇవ్వాలన్న ఉద్దేశ్యం వాళ్లకు లేదని షర్మిళ సెటైర్లు వేశారు!!

ఆ తర్వాత 2021లో తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టడం.. మొదట తెలంగాణలో, తర్వాత ఆంధ్రకు రావడం జరిగిందని అన్నారు.

"టీడీపీ హ్యాండిల్ లో లెటర్ పోస్ట్ అయితే...?"

ఈ సందర్భంగా నేను జగన్ కి ఓ లేఖ రాస్తే.. అది ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ అయితే.. నాకు ఏమి సంబంధం అని షర్మిల ప్రశించారు. తానైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని.. నా వరకూ నేను గానీ, నా మనుషులు గానీ బయటపెట్టలేదని.. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్సార్ బిడ్డకు లేదని షర్మిల పేర్కొన్నారు.