Begin typing your search above and press return to search.

"సాయిరెడ్డి రాజీనామా చిన్న విషయం కాదు"... షర్మిల ఇంట్రస్టింగ్ కామెంట్స్!

ఈ సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు.

By:  Tupaki Desk   |   25 Jan 2025 3:56 PM GMT
సాయిరెడ్డి రాజీనామా చిన్న విషయం కాదు... షర్మిల ఇంట్రస్టింగ్  కామెంట్స్!
X

వైసీపీ కీలక నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా సాయిరెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహరం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. సాయిరెడ్డిలాంటి వ్యక్తి పార్టీని రాజీనామా చేశారంటే అది చిన్న విషయం కాదని.. ఇదే సమయంలో వివేకా హత్య విషయంలో నిజం చెప్పారని.. మిగిలిన విషయాలు కూడా బయటపెట్టాలని షర్మిల పలు కామెంట్స్ చేశారు.

తాజాగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన షర్మిల.. జగన్ కు విజయసాయి అత్యంత సన్నిహితుడని.. జగన్ ఏమి ఆదేశిస్తే అది చేయడం, ఎవరిని టిట్టమంటే వాళ్లను తిట్టడం అతని పని అని అన్నారు. ఇదే సమయంలో... రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా తన బిడ్డల విషయంలోనూ సాయిరెడ్డి అబద్ధాలు చెప్పిన వ్యక్తి అని షర్మిల మండిపడ్డారు.

అయితే... ఆ అబద్దాలు, వ్యక్తిగత విమర్శలు జగన్ చెబితేనే అతను చెప్పారని.. ఈ స్థాయిలో జగన్ కు సన్నిహితుడైన వ్యక్తి రాజీనామా చేశారంటే అది చిన్న విషయం కాదని అన్నారు. ఈ సందర్భంగా... వైసీపీ కార్యకర్తలకు, వైఎస్ అభిమానులకు ఓ అప్పీల్ చేశారు షర్మిల. ఇందులో భాగంగా... జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయారని, ఇది ఆలోచించాలని అన్నారు.

విజయసాయిని జగన్ వదిలేశారంటే అది ఎందుకు..? అత్యంత సన్నిహితులు ఒక్కొక్కరుగా బయటలు వెళ్తున్నారంటే అది ఎందుకు..? ప్రాణం పెట్టిన వాళ్లు సైతం జగన్ ను వీడుతుననరంటే అది ఎందుకు..? అంటే... నాయకుడిగా జగన్ విశ్వసనీయత కోల్పోయారు అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఆలోచించాలని వైసీపీ కార్యకర్తలకు అప్పీల్ చేశారు.

ఇదే సమయంలో... ఇంతకాలం విజయసాయిని బీజేపీ దగ్గర ఉంచే కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారని.. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు అని షర్మిల ఆరోపించారు. అయితే.. సాయిరెడ్డి ఇప్పుడు బయటకు వచ్చేశారు కాబట్టి నిజాలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే... "గతంలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అనే విషయం మీకూ తెలుసు.. వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషం.. మిగతా విషయాలు కూడా బయటపెట్టాలి" అని విజయసాయిరెడ్డిని షర్మిల కోరారు!