Begin typing your search above and press return to search.

'జగన్ ది అక్రమ సంబంధం'... షర్మిల షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలో ఆ కామెంట్లకు బలం చేకూరుస్తూ మరోసారి జగన్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.

By:  Tupaki Desk   |   10 Jan 2025 9:19 AM GMT
జగన్  ది అక్రమ సంబంధం... షర్మిల షాకింగ్  కామెంట్స్!
X

సమయం ఏదైనా, సందర్భం మరేదైనా, అంశం ఎలాంటిదైనా... వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తన సోదరుడు జగన్ పై నిప్పులు చెరిగే విషయంలో షర్మిల ఏమాత్రం తగ్గరనే కామెంట్లు ఇటీవల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ కామెంట్లకు బలం చేకూరుస్తూ మరోసారి జగన్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.

అవును... తాజాగా ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపనలు చేశారు. అయితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాత్రం నోరు మెదపలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ విషయంపై స్పందిస్తూ జగన్ పై విమర్శలు గుప్పించారు షర్మిల.

ఇందులో భాగంగా... ప్రధాని తన తాజా పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏమీ మాట్లాడకపోయినా.. రాష్ట్రంలోని కూటమితో పాటు జగన్ కూడా మౌనంగా ఉండిపోయారని షర్మిల విమర్శించారు. కేంద్రంలోని బీజేపీతో రాష్ట్రంలో ఎన్డీయే కూటమిది సక్రమ సంబంధం అని చెప్పిన షర్మిల... జగన్ ది మాత్రం అక్రమ సంబంధం అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇదే సమయంలో... వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయ్యి ఉండి జగన్ బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోడీ మాట్లాడకపోయినా మౌనంగా ఉండటంపై అటు ఏపీ కూటమి ప్రభుత్వాన్ని, జగన్ ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నేడు విశాఖలో మౌనదీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో విశాఖలో పర్యటిస్తున్న షర్మిల... జై భీమ్, జై బాపూజీ, జై సంవిధాన్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సమయంలో కాంగ్రెస్ అంబేద్కర్ జపం చేస్తే తప్పేమిటని ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్ కోసం మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని భారతీయ జనతాపార్టీపై విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ ను బీజేపీ అవమానపరిచిందని మండిపడ్డారు.

ఇదే సమయంలో... కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్స్ ఉండవని.. రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని సంచలన ఆరోపణలు చేసిన షర్మిల... అంబేద్కర్ ను అవమానించిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని.. లేకపోతే ప్రధాని మోడీ ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.